విజయవాడ నగరపాలక సంస్థ
02-08-2025
కృష్ణానది పరివాహక ప్రాంతాలు క్షేత్రస్థాయిలో పరిశీలన
వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలు
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణానది ప్రవాహిక ప్రాంతాలైన పునమిఘాట్, భవాని ఘాట్, మరియు సివిఆర్ ఫ్లైఓవర్, ఊర్మిళ సుబ్బారావు నగర్ పర్యటించి వరద ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయిల్ ఇంజన్ మరియు మిషనరీతో వరద నీరు ప్రవాహం నివాస ప్రాంతాలకు రాకుండా చర్యలు తీసుకొని ఫ్లడ్ డ్యూటీ టీమ్స్ ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఊర్మిళ సుబ్బారావు నగర్ మరియు సివిఆర్ ఫ్లై ఓవర్ మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్ లలో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలో డిసిల్టింగ్ పనులను నిరంతరాయంగా చేస్తుండాలని ఎప్పటికప్పుడు సిల్ట్ లను తీస్తూ నీటి ప్రవాహానికి ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అన్నారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కె.అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ పి. సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.