కృష్ణాజిల్లా….
పెనమలూరు నియోజకవర్గం….
పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న శక్తి టీం* ….
*మహిళల భద్రత గురించి అవగాహన కల్పించారు*….
పెనమలూరు నియోజకవర్గ పోలీసు సర్కిల్ పరిధిలో చిగురుపాటి కృష్ణవేణి స్కూల్ నందు శక్తి టీమ్ లతో సైబర్ క్రైములు పోక్స్కౌ యాక్ట్ గుడ్ టచ్ పై అవగాహన కల్పించినట్టు తెలిపారు…
ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ సమాజం లో మహిళల పట్ల జరిగే నేరాలు జరగకుండా చేపట్టే ముందస్తు చర్యలు గురించి విద్యార్థులకు వివరించారు.
సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పై అవగాహన, రోడ్ ప్రమాదాలు , అగ్నిమాపక అంశాల పై అవగాహన కల్పిం చారు.
చట్టాల పై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని, మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడంలో విద్యార్థులు కీలకమని అని విద్యార్థులకు తెలిపారు.
మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువత అనేక రుగ్మతలు కొని తెచ్చుకుంటున్నారని, అలాగే అర్హత లేకుండా యువత ద్విచక్ర వాహనాలు వాడడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అని అన్నారు.
ఈ కార్య్రక్రమంలో ఉపాధ్యాయులు , యువ శక్తి కానిస్టేబుల్స్ , విద్యార్థులు పాల్గొన్నారు.