
కూటమి పాలనలో గుడివాడలో రూ.12 కోట్లకు పైగా నిధులతో విద్యుత్ శాఖలో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే….
గత పాలకులు విద్యుత్ వ్యవస్థను గాలికి వదిలేసారు…
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే రాము
రూ.3.08 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ శాఖలో నూతనంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం..
గుడివాడ నవంబర్ 22: గుడివాడ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రూ.12 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందని ఆయన చెప్పారు.
గుడివాడ ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా రూ.3.08కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు తెలియజేశారు. పలు అభివృద్ధి పనుల పురోగతి నివేదికలను అధికారులు ఎమ్మెల్యే రాముకు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. గుడివాడ పట్టణంతో పాటుగా నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరి ప్రమాద భరితంగా ఉన్నాయన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటినుండి ఇప్పటివరకు నియోజకవర్గంలో రూ. 12 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపిన ఎమ్మెల్యే రాము, ఇతర అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
రూ 3.08 కోట్ల నిధులతో ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వాటిలో ప్రధానంగా నందివాడ నుండి పుట్టగుంట గ్రామం వరకు రూ.1.50 కోట్లతో 33కెవి ఇంటర్ లింకింగ్ లైన్, మరియు రూ.16 లక్షలతో నందివాడ గ్రామంలో ఫీవర్ ఫైబరికేషన్ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు. ఇవి కాక ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా శిథిలావస్థకు చేరిన స్తంభాలు మార్పు, ప్రజలకు అవసరమైన చోట్ల నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, ప్రమాద భరితంగా ఉన్న చోట్ల విద్యుత్తు లైన్ల మార్పు తదితర మైనర్ పనులను, చేపడుతున్నామని ఎమ్మెల్యే వేనిగండ్ల రాము తెలిపారు.
ఈ సమావేశంలో విద్యుత్ శాఖ E.E GB శ్రీనివాసరావు, ad లు బాబిరాజు, రూరల్ కిరణ్ బాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
![]()
