కూటమి పాలనపై ప్రజా స్పందన భేష్: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

3
0

కూటమి పాలనపై ప్రజా స్పందన భేష్: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడివాడ పట్టణం 27..4…5 వార్డుల్లో సుపరిపాలనకు తొలి అడుగు పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే

వీధి వీధినా ఎమ్మెల్యే రాముకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజానీకం

గుడివాడ జులై 19:కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పాలనకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.

గుడివాడ పట్టణంలోని 27..4..5 వార్డుల్లో సుపరిపాలనలో తొలి ఆడుగు కార్యక్రమాన్ని ఆత్మీయ పలకరింపుల మధ్య శనివారం ఎమ్మెల్యే రాము నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ఇంటింటికి వెళుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.తమ ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు వీధి వీధినా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు.

అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజక వర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగా క్షేమాలు తెలుసుకుంటున్నామన్నారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికే చాలా అమలు చేశామని మిగిలిన హామీలు త్వరలోనే అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి పాలన సాగుతోందన్నారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరాలను ప్రజలే మాకు చెబుతుండటం ఆనందదాయకమన్నారు. రానున్న నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఎమ్మెల్యే రాము అన్నారు

ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, టిడిపి నాయకులు పండ్రాజు సాంబశివరావు,పోలాసీ ఉమా, లింగం ప్రసాద్,చేకూరు జగన్మోహన్రావు,కంచర్ల సుధాకర్, యాక్కలి మనీదీప్, కడియాల గణేష్, మిక్కిలినేని రమేష్, మజ్జాడ నాగరాజు,సయ్యద్ జబీన్, వంగపండు ఆదినారాయణ, ఇమ్మానియేలు, యేసుపాదం, కాగితా శివప్రసాద్, నిరంజన్, తులసీ రాణి, మల్లికా బేగం, కొడాలి బాలు, దేవేంద్రుడు, కనకంబరం, బడవల వెంకట హరి….28వ వార్డు టిడిపి నాయకులు పులవర్తి డేవిడ్, కొడాలి రాజా, రెడ్డి అప్పారావు, తేర్లీ రంగా, జయశ్రీ, గుడపాటి హనుమంతు, నూతక్ శ్రీనివాసరావు, బొక్క రమ ప్రసాద్, నాగరాజు, వీర శంకర్రావు, లంకపల్లి త్రినాధులు, రఫీ….*4వ వార్డు టిడిపి నాయకులు * బాలసాని భవాని శంకర్, కొడాలి అనిల్, కొడాలి బాలు, బాలసాని రఘుబాబు, విజయ్, కొత్త సీత, రెడ్డి గణేష్, వీర భవాని…..5వ వార్డు టిడిపి నాయకులు
తుమ్మల సుబ్బారావు, వెంకటేశ్వరరావు, రెడ్డి షణ్ముఖ, మూడెడ్ల సూర్యనారాయణ, సురేంద్ర, తిప్పా లక్ష్మి, భాగ్యలక్ష్మి, రోజా, మాదాల సునీత, వినోద్ కుమార్, సాయి కృష్ణ, కాజా శ్రీనివాస్, పట్టణ పరిధిలోని పలువురు పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here