Home Political news కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

2
0

 కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి

 మహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతలమే లక్ష్యం

 మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గిట్టుబాటు వచ్చేలా చర్యలు

త్వరలో ఎన్టీఆర్ ట్రస్టు నుండి కుప్పంలో ఉచిత డీఎస్సీ కోచింగ్

*- హైదరాబాద్ లో పెట్టిన విధంగా ఐఏఎస్ ఉచిత కోచింగ్ పై దృష్టి పెడతాం*

*- కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా స్కూలు ఏర్పాటుకు చర్యలు*

*- రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు*

*కుప్పం:-*

మహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ముందుకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం పట్టణంలో నియోజకవర్గ మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఎన్టీఆర్ ట్రస్టు తరపున భువనేశ్వరి ఏర్పాటు చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బందితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో రిబ్బను కత్తిరించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను భువనేశ్వరి ప్రారంభించారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. తదనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ….

ఎన్టీఆర్ ట్రస్టును సేవా భావంతో చంద్రబాబు స్థాపించారు.

చంద్రబాబు ఏ స్ఫూర్తితో ట్రస్టును స్థాపించారో…ఆ స్ఫూర్తిని నేను, నా సిబ్బంది ముందుకు తీసుకెళుతున్నాము.

కుప్పంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళా సంక్షేమమే ధ్యేయంగా పెట్టాము.

మహిళలకు బట్టలు కుట్టడం నేర్పిస్తే వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడతారని మేం భావిస్తున్నాం.

కేవలం కుట్టు మిషన్లతోనే మేము ఈ కార్యక్రమాలు ఆపడం లేదు…మరిన్ని ఆలోచనలు ఉన్నాయి.

బట్టల ఫ్యాక్టరీల వారితో మేం మాట్లాడుతున్నాం…వారికి ఏ మోడల్ బట్టలు కావాలో వాటిని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ పొందిన వారితో బట్టలు కుట్టించి ఫ్యాక్టరీకి అమ్మేలా చర్యలు తీసుకుంటున్నాం.

వైర్ బుట్టలు, ఇతర చేతి పనులు ఏమైతే మహిళలకు ఆసక్తి ఉంటుందో వాటిలో కూడా శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకెళతాం.

శిక్షణ తీసుకున్న మహిళలకు కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి వారిని మరింత ముందుకు తీసుకెళతాం.

మహిళలు తామ సంపాదనపై సంతృప్తి చెందేలా మేం చర్యలు తీసుకుంటాం. ఆ స్థాయిలో సంపాదించేలా చర్యలు తీసుకుంటాం.

ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మహిళలకు బాసటగా నిలబడతాం.

కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా స్కూలు ఏర్పాటు చేస్తాం. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం.

కుప్పం నియోజకవర్గంలో నిరుద్యోగ మహిళలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.

హైదరాబాద్ లో పెట్టిన విధంగా ఉచిత ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను కుప్పంలో పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం…అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here