చిత్తూరు జిల్లా/కుప్పం
కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన- వినతులు ఇచ్చేందుకు పోటెత్తిన ప్రజలు
సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన్ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నియోజవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద సీఎం చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.