కాలుష్య రహిత నగరానికి మరో అడుగు వేసిన విజయవాడ నగర పాలక సంస్థ
ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్తంగా
కాలుష్యాన్ని నియంత్రించే దిశగా మరో అడుగు ముందుకు వేశారు. విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కె.వి సత్యవతి మంగళవారం అర్థ గ్లోబల్, ముంబై మరియు ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (TERI), న్యూఢిల్లీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కె.వి సత్యవతి మాట్లాడుతూ వాయు కాలుష్య నియంత్రణకు, ఈ బృందం మంగళవారం మరియు బుధవారం విజయవాడ నగరంలో ఉన్న వాయు కాలుష్యానికి లోనయ్యే రెండు ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలపై ఒక పైలెట్ స్టడీ నిర్వహిస్తారని, దీని ద్వారా కాలుష్యానికి ముఖ్య కారకాలు వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు సూచిస్తారని, అది పాటించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించవచ్చని తెలిపారు. అర్ధ గ్లోబల్ మరియు టెర్రి నుండి వచ్చిన నిపుణుల జ్ఞానాన్ని ఉపయోగించి, వాయు కాలుష్యం వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని ఈ పైలెట్ అధ్యయనం ద్వారా నగర పౌరులకు ఆరోగ్యకరమైన జీవనం కల్పించగలమని అన్నారు.
ఈ అర్ధా గ్లోబల్ ముంబై నుండి సమావేశంలో వివేక్ -ప్రిన్సిపాల్, సునంద- కన్సల్టెంట్, TERI -ఎయిర్ క్వాలిటీ రీసెర్చ్ డివిజన్, న్యూ ఢిల్లీ నుండి డాక్టర్ అంజు గోయల్- అసోసియేట్ డైరెక్టర్, శివాణి శర్మ- అసోసియేట్ ఫెలో, జస్టిన్ జాకోబ్- రీసెర్చ్ అసోసియేట్, శశి తివారి- కన్సల్టెంట్ పాల్గొన్నారు.