Home Andhra Pradesh కార్మిక కర్షక.పక్షపాతి జగన్

కార్మిక కర్షక.పక్షపాతి జగన్

3
0

 కార్మిక కర్షక.పక్షపాతి జగన్

 కార్మిక పక్షపాతిగా నిలిచి అట్టడుగు వర్గాలకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు

కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం.ప్రధాన. కార్యాలయంలో. ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు. విశ్వనాథ రవి. ఆధ్వర్యంలో.బుధవారం వేడుకలను నిర్వహించారు. 

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన షేక్ ఆసిఫ్ వైయస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి ట్రేడ్ యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆసిఫ్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు లేనిదే దేశ అభ్యున్నతి సాధ్యం కాదన్నారు. కార్మికులు అభివృద్ధి సాధిస్తే ఆ దేశం అభ్యున్నతి సాధిస్తుందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో కార్మికుల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అట్టడుగు వర్గాలు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలని అనేక రూపాలలో అండగా నిలుస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిని సాధించే దిశగా తీసుకెళ్లటానికి అవకాశం ఉంటుందన్నారు. కార్మికులందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో. రాష్ట్ర జైన్ కార్పొరేషన్ చైర్మన్. మనోజ్ కొఠారి. జిల్లావక్ఫ్.బోర్డ్ చైర్మన్. షేక్ గౌస్ మొహిద్దిన్. జాతీయ యాదవ సంఘం అధ్యక్షులు. లోక వెంగళరావు యాదవ్. కార్పొరేటర్లు. కోటిరెడ్డి. చలపతిరావు. చైతన్య రెడ్డి. గుడివాడ నరేంద్ర. వైయస్సార్ టి యు సి రాష్ట్ర అధికార ప్రతినిధి. షేక్ మహరాజ్. వైయస్సార్ టి యు సి. రీజినల్ కోఆర్డినేటర్. నంబూరుప్రదీప్.నగర కార్యదర్శులు. వినోద్.రుద్ర శంకర్.మధు.నాయకులు.కరీముల్లా. ఖాన్. ప్రకాష్. సూర్య రెడ్డి. తదితర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here