కారు తగలబెట్టిన కేసులో నిందితుడి అరెస్ట్.

Spread the love

సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్, నార్త్ డివిజన్ ఎన్.టి.ఆర్ జిల్లా,విజయవాడ.
తేది.20-11-2025.

కారు తగలబెట్టిన కేసులో నిందితుడి అరెస్ట్.
ది:12/10/2025 వ తేదీన డాక్టర్ పొన్నూరు గౌతమ్ రెడ్డి వారి ఇంటి లోని గ్రౌండ్ ఫ్లోర్ నందు పెట్టిన AP 40 JB 1234 అనే నంబరు కలిగిన మహేంద్ర 9E ఎలక్ట్రిక్ కారును గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసి నిప్పు అంటించారని ఇచ్చిన ఫిర్యాదు పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నందు Cr.no:321/2025 గా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సదరు ఘటనపై నగర పోలీసు కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, పశ్చిమ జోన్ ఇన్ ఛార్జ్ డి.సి.పి. శ్రీగుణ్ణం.రామ కృష్ణ సూచనలతో నార్త్ ఏ.సి.పి. శ్రీమతి Dr.కె.స్రవంతి రాయ్ పర్యవేక్షణ లో సత్యనారాయణ పురం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్.వి.వి లక్ష్మి నారాయణ వారి సిబ్బందితో కలిసి పలు బృందాలుగా ఏర్పడి ఘటన జరిగిన ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాలలోని సి.సి.కెమెరాలను పరిశీలించి అనుమానితుని గుర్తించి, అతని కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపధ్యంలో ఈ రోజు ఇన్పెక్టర్ గారికి రాబడిన పక్కా సమాచారం మేరకు సత్యనారాయణ పురం ఎస్.ఐ. శ్రీమతి సౌజన్య వారి సిబ్బందితో కలిసి సత్యనారాయణపురం మట్టిరోడ్డు వద్ద అనుమానిత వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారించి అరెస్ట్ చేయడం జరిగింది.

నిందితుని వివరాలు:
హైద్రాబాద్, బండ్లగూడ, హైదర్ షా కోట కు చెందిన హరికోటి.లెనిన్ బాబు@ లెనిన్@ బాబు , (52 సం) ( 2005 కు ముందు విజయవాడ పెజ్జోనిపేట ఏరియాలో నివాసం ఉండేవాడు)

వివరాల్లోకి వెళితే…… ముద్దాయి అయిన హరికోటి.లెనిన్ బాబు, 2005 విజయవాడ నుండి హైదరాబాదులో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ, పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తునాడు , 2005 కు ముందు విజయవాడలో నివాసం ఉండేవాడు, గతంలో ఇతనిపై సత్యనారాయణపురం , కృష్ణలంక, మాచవరం, సూర్యరావుపేట, గవర్నర్ పేట, PM పాలెం మొదలగు పోలీసు స్టేషన్ లలో వివిధ దొంగతనాలు చేసిన 15 కేసులు ఇతని మీద క్రైమ్ సస్పెక్ట్ షీట్ కూడా కలదు. ఇతను రాధా రంగాలకు వీరాభిమాని.

ఈ క్రమంలో సుమారు రెండు నెలల క్రితం యూట్యూబ్ చూస్తున్న సమయంలో గౌతం రెడ్డి ఒక టి.వి. చానెల్ లో ముఖాముఖి ప్రోగ్రాంలో వంగవీటి.రంగా ని విమర్శించినారు. సదరు విమర్శను చూసి స్వాతహాగా రంగా అభిమాని అయిన ముద్దాయి గౌతంరెడ్డి కి ఏదైనా ఆస్తి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ది:12/10/2025 వ తేదీన సికింద్రాబాద్ నుండి విజయవాడ కు వచ్చి గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల వారి ద్వారా గౌతమ్ రెడ్డి ఇంట్లో లేరని కారు ఉందని తెలుసుకొని, సమీపంలో గల పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొనుక్కోని కార్ వద్దకు వెళ్లి కారు వెనుకనుండి పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడ నుండి వెళ్లిపోయినాడు.

వీడియో గురించి విచారించగా సెప్టెంబర్ 2017 లో ఒక టివి షో అని గుర్తించడం జరిగింది. ఆ షోలో గౌతం రెడ్డి రాధా రంగా ను కించపరుస్తూ మాట్లాడటం సహించలేక ఈ పని చేశాడని తెలిసింది.

Loading