విజయవాడ, ఆగస్టు 9, 2025: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి లలిత దంపతులు ఈరోజు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిని సందర్శించారు. జస్టిస్ లలితకుమారి బాపట్ల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. కర్ణాటక హైకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్, ఆలయ కార్యనిర్వాహణాధికారి (EO) వి.కె. శీనా నాయక్ వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీయుత కమీషనర్, దేవాదాయశాఖ వారి చేతుల మీదుగా శ్రీ అమ్మవారి చిత్ర పటం బహుకరించి వేద అశ్వరచనము,శ్రీఅమ్మవారి ప్రసాదములు అందజేసినారు.
Home Andhra Pradesh కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి లలిత దంపతులు ఈరోజు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల...