ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా హాజరై 38వ ఒలంపిక్ రన్ ని ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టిడిపి బొండా ఉమామహేశ్వరరావు జరిగింది

Spread the love

 23-6-2024

ది:23-6-2024 ఆదివారం ఈ రోజు ఉదయం బందర్ రోడ్డు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నుండి నిర్వహించిన

ఒలంపిక్ డే రన్* కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా హాజరై 38వ ఒలంపిక్ రన్ ని ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు జరిగింది

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- ఒలంపిక్స్ క్రీడల్లో అన్ని దేశాలు ఎన్నో ఆశలతో, ప్రతి క్రీడాకారుడు కూడా అక్కడ ఒక్క పథకం నెగ్గి తమ దేశానికి గొప్ప పేరును తీసుకుని వచ్చి తమ దేశ జెండాను ప్రపంచ దేశాలకు చూపించాలని దృఢ నిశ్చయంతో పోటీపడేటువంటి ఒలంపిక్స్ 

ఒలంపిక్స్ 1896లో గ్రీస్ దేశంలో ప్రారంభించడం జరిగినదని ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ ఒలంపిక్స్ పోటీలు ఈ సంవత్సరం పారిస్ లో నిర్వహిస్తా ఉన్నారని, ప్రపంచంలోని అన్ని దేశ క్రీడాకారులు ఈ ఒలంపిక్ పోటీల కోసం చాలా ఎదురు చూస్తా ఉన్నారని, క్రీడాకారులు అనేవారు ఎక్కడినుండో పుట్టాలని మన మధ్య పిల్లలుగా ఆటలు నేర్చుకొని మంచి కోర్సుల ట్రైనింగ్ లో వారు ఉన్నత స్థానాలకు వెళ్తారని ఎన్నో బహుమతులు వారు పుట్టిన ప్రాంతానికి దేశానికి గొప్ప పేరులు తీసుకొని వస్తారు అని

గతంలో కూడా ఒలంపిక్స్ లో మన రాష్ట్రానికి ఎన్నో పథకాలు వచ్చినాయి అని, విద్యార్థులు చిన్నప్పటి నుండే క్రీడలను నేర్చుకుని వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వారికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షిస్తున్నట్ట

రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనకి ఇంటర్నేషనల్ స్టేడియంలో కూడా రాబోతా ఉన్నాయని,2014 నుండి 2019 వరకు నేషనల్ లెవెల్ గా అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగినదని, తిరిగి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో క్రీడలకు మంచి రోజులు వచ్చినాయి అని, నారా చంద్రబాబునాయుడు గారు పూర్తి గా క్రీడల పట్ల ఆయనకు ఉన్న ఇష్టాన్ని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ స్టేడియంను నిర్మిస్తా ఉన్నారని స్పోర్ట్స్ సిటీని కూడా పెడతా ఉన్నారని బోండా ఉమా  తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *