ఒపియాడ్స్ అండ్ డ్రగ్స్ అబ్యూస్ నియంత్రణపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్
విజయవాడ, జూలై 21:
ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ మరియు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (EAGLE) సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ విజయవాడలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈగల్ ఐ.జ.పి. ఆకే రవి కృష్ణ, ఐపిఎస్ పాల్గొని, ఆపరేషన్ GARUDA . ຜູ້ ບ 2.0 To Prevent Opioid & Drug Abuse 5 భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
“NO HARM TO OTHERS” మీరు ఇచ్చే మందు దాని వల్ల ఏ ఒక వ్యక్తి నష్ట పోకూడదు, మరియు వారి కుటుంబం కోల్పోకూడదు.
ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం నేను మీరు వేరు వేరు కాదు, మనం అందరం ఒక్కటే.
ఎక్కడైనా తుపాను వచ్చింది అంటే అక్కడ మెడికల్ అసోసియేషన్ వారు వుంటారు. భోజన పొట్లాలు పంచడం, అన్ని సేవా కార్యక్రమాల్లో మీరు వుంటారు.
మన మెడికల్ అసోసియేషన్ వారు ఈ విష్యం లో ముందుంటారు.
మనం, మన సొసైటీ, మనం అందరం కలసి నిర్మిచుకున్నాము మన వల్ల ఈ సొసైటీ నష్టపోకుడదు.
కచ్చితంగా అందరు ఆలోచించండి దీని నుండి మనం ఎలా ముందడుగు వేయాలి ఎలా మనం సమాజం నష్ట పోకుండా చూడాలి.
చిన్న ఉదాహరణ చెప్తా ఒక కొడుకు 10 వ తరగతి పరీక్షలలో ఫస్ట్ వచ్చి, ఉన్నత చదువులకోసం కాలేజీ కి వెళ్ళాడు అక్కడ NRX డ్రగ్స్ కు భానిస అయ్యాడు. పూర్తిగా ఎడిక్ట్ అయి చదువుని వదిలేసాడు, ఇప్పుడు ఆ తల్లికి ఎవరు సమాదానం చెప్పాలి..
ముఖ్యం గా విద్యా సంస్థలు దగ్గర వున్నా మెడికల్ షాప్ లకు వచ్చి ఎవరైనా మెడిసిన్ కొంటె ప్రిస్క్రిప్షన్ లేకుండ FIRST LINER DIFFENCE మొదటిగా అపగలిగేది మీరే. > అప్పుడు మీరు డ్రగ్ కంట్రోల్ కి చెప్పవచ్చు లేదా ఈగల్ కాల్ సెంటర్ 1972 నెంబర్ కి అయిన తెలియజేయవచ్చు. మనం అందరం కలిస్తే నిషేదిత మందులను అపగలుగుతాం.
ఈగల్ ప్రారంభం ఐనప్పటి నుండి రాష్ట్రం అంతట ఇప్పుడు గంజాయి కోసం యుద్ధమే జరుగుతుంది.
మన ఆంధ్రప్రదేశ్ లో 11 మండలాలో సుమారు 375 గ్రామాలను మేము గుర్తించి మేము డ్రోన్స్ సర్వేలెన్స్ మరియు కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ మరియు అవేర్నెస్ కార్యక్రమాలు అదే విధం గా NDPS చట్టం గురించి చెప్పడం జరుగుతుంది.
ప్రభుత్వం ఆల్టర్నేటివ్ క్రాప్స్ గురించి చెప్పడం ద్వార ఆంధ్రపదేశ్ గంజాయి సాగు లేదు.
ఒరిస్సా లో గల 5 జిల్లాల నుండి మాత్రమే మనకు వస్తుంది. దాన్ని కూడా ఆపాలి.
అదేవిధంగా ఇప్పుడు గంజాయి సాగు లేదు గనుగ ప్రభుత్యం చైతన్యం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వచ్చింది.
గత సంవత్సరం 45 లక్షల మొక్కల ను పంపిణి చేస్తే ఈ సంవత్సరం ప్రభుత్వం లక్ష్యం 2 కోట్ల మొక్కలు ఉచితం గా పంపిణి చేస్తుంది.
అదే విధంగా సింతటిక్ డ్రగ్స్ కొకైన్, హెరాయిన్ MDMA కావచ్చు హైడ్రో గాంజా కావచ్చు వీటన్నిటి మీద మేము నిఘా పెట్టడం జరిగింది.
ఎక్కడై అతే మాకు బెక్వార్డ్ లింక్ వస్తున్నాయో ఇతర రాష్ట్ర లకు టీమ్స్ పంపించి వారి మీద చర్యలు తీసుకుంటున్నాం.
ఇప్పుడు చెప్పేది NRX డ్రగ్స్ ఇది త్వరగా ఈజి గా దొరికే మెడిసిన్ దీనికి ఒక రిజస్టర్ పెట్టండి.
చీటీ ఉంటేనే ఈ మందులు అమ్మంది లేకపోతే డ్రగ్ కంట్రోల్ గని ఈగల్ గాని సమాచారం ఇవ్వండి.
విజిలెన్సు అండ్ ఎంఫోర్సుమెంట్, డ్రగ్ కంట్రోల్, ఈగల్, మెడికల్ అసోసియేషన్ కలిసి పని చేయాలి.
ఈ రోజు భలమైన సంకల్పం తీసుకోవాలి. ఎవరైతే దారి తప్పి వుంటే వారికి చెప్పండి తప్పు చేయవద్దని.
ప్రిస్క్రిప్షన్ లేకుండ మందులు అమ్మమని సంకల్పం తీసుకుంటారని అని అందరిని కోరుతూ ముగించారు.
ఈ సందర్భంగా కె.జి.వి. సరిత, ఐపిఎస్ (DCP, NTR పోలీస్ కమిషనరేట్, విజయవాడ) మాట్లాడుతూ:
- మెడికల్ షాప్ ఓనర్స్ మరియు అసోసియేషన్ మెంబెర్స్ సరిగా రికార్డ్స్ మెయిన్ టైన్ చేయాలి.
- ప్రిస్క్రిప్షన్ లేకుండ NRX డ్రగ్స్ అమ్మవద్దు.
- ప్రిస్క్రిప్షన్ లోవున్న మందులు మాత్రమే అమ్మండి.
- డ్రగ్స్ వాడకంపై సమాజం మొత్తంగా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కె. నాగేశ్ బాబు (SP – EAGLE, ఆంధ్రప్రదేశ్) మాట్లాడుతూ:
- ఈగల్ ఏర్పాటైన తరువాత రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ఎబ్యూన్ నివారణలో అనేక విజయాలు సాధించామని వివరించారు.
- భవిష్యత్తులో మన అందరం కలిసి పని చేయాలి.
- ఎక్కడ కూడా ఎక్కువగా NRSX డ్రగ్స్ అమ్మకుండా చూడండి.
ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.ఎ.రత్నం మాట్లాడుతూ,
- పార్మని రంగం నుండి డ్రగ్ మిస్యూజ్ నివారణకు తమ సంఘం కట్టుబడి పని చేస్తుందని తెలిపారు.
కార్యక్రమ విజయవంతానికి సంఘం జనరల్ సెక్రటరీ కె. కరుణ కుమార్ గుప్తా మరియు KS ప్రసాద్ సమన్వయం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ సభ్యులు మరియు కెమిస్ట్స్ అండ్ డ్రగ్ అసోసియేషన్కు చెందిన సభ్యులు సుమారు 300 మంది సభ్యులు పాల్గొన్నారు.