ఒక పక్కన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ – మరొక పక్కా నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయంలో నిత్యం CMRF చెక్కుల పంపిణీ

2
0

15-7-2025

ఒక పక్కన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ – మరొక పక్కా నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయంలో నిత్యం CMRF చెక్కుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గ లో ఎంతో మంది అనారోగ్య బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నాం -MLA బొండా ఉమ

1లక్ష 6వేల 100 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన – MLA బొండా ఉమ

ధి:15-7-2025 మంగళవారం సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ఆసరాగా నిలుస్తోంది అని నియోజకవర్గం లోని 33వ డివిజన్ సత్యనారాయణపురం కు చెందిన బొమ్మిశెట్టి కన్యాకుమారి కి ₹56,100 రూపాయల, బెజవాడ వెంకట నారాయణ స్వామి కి ₹30,000 రూపాయల, ఉట్కూరు సుధాకర్ కి ₹20,000 CMRF చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు లబ్దిదారులకు పంపిణీ చేశారు

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి  చేయూతనిస్తూ ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ప్రతిరోజు కూడా MLA కార్యాలయంలో లబ్ధిదారులకు పారదర్శకంగా ఎటువంటి అవినీతి జరగకుండా అందిస్తున్నామని…

అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని..

రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు.

ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి వర్యులు నారాచంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు..

ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కి, సెంట్రల్ MLA  బొండా ఉమ కి, తెలుగుదేశం ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఘంటా కృష్ణమోహన్, 33వ డివిజన్ ఇంచార్జ్ పాటి విజయకుమార్, బత్తుల కొండ, పలగాని భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here