Home Andhra Pradesh ఒక్క సారి మాట ఇచ్చామంటే మాటతప్పం మడమతిప్పం : MLC మొండితోక అరుణ్ కుమార్

ఒక్క సారి మాట ఇచ్చామంటే మాటతప్పం మడమతిప్పం : MLC మొండితోక అరుణ్ కుమార్

2
0

 ఒక్క సారి మాట ఇచ్చామంటే మాటతప్పం మడమతిప్పం : MLC మొండితోక అరుణ్ కుమార్ 

జరిగిన అభివృద్ధితోపాటు, రాబోయే ఐదు సంవత్సరాలకు జరగాల్సిన అభివృద్ధికి ప్రణాళికలు రచించి, అన్ని వర్గాల ప్రజలకు అండ దండ గా ఉంటాం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా,అభివృద్ధిని మాత్రం పరుగులు పెట్టిస్తాం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 

NTR జిల్లా / నందిగామ టౌన్

ది.05-05-2024(ఆదివారం) 

మన నందిగామ… మన మేనిఫెస్టో ను… శనివారం రాత్రి వైసీపీ కార్యాలయంలో విడుదల చేసిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

*ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అంతఃకరణ శుద్ధితో నెరవేరుస్తాం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుఈమార్ *

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మరోసారి గెలవబోతున్నారు… ఈ తరుణంలో రానున్న ఐదేళ్లలో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు నియోజకవర్గ ప్రజలకు ఏమేమి చేయబోతున్నారో… నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేస్తారో… అనేది ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తెలిపారు*.

ఐదేళ్ల కాలంలో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు నందిగామ నియోజకవర్గ ప్రజల కోసం రూపొందించిన ప్రణాళికలు*

వేదాద్రి ఎత్తిపోతల పథకం మరమ్మత్తులు చేయించి పూర్తిస్థాయిలో రైతులను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు నాలుగు కొత్త మోటర్లు ఏర్పాటు చేయడం.. వెంకటమ్మ కట్ట ఎత్తిపోతల పథకం గుడిమెట్ల పేజ్ త్రీ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కృషి చేయడం.*

కృష్ణానది నుండి వేర్వేరు పైప్లైన్ల ద్వారా కంచికచర్ల మరియు వీరులపాడు మండలాలకు ఇంటింటికి రక్షిత మంచినీటి పథకం*

నందిగామ పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రిని.. నందిగామ వైద్య కళాశాలగా అభివృద్ధి చేయటం*.

నందిగామ పట్టణంలో ఇంటింటికి ఉచితంగా మంచినీటి కులాయి కనెక్షన్ ఏర్పాటు చేయడం*

నందిగామ పట్టణంలోని అనాసాగరం నుంచి అంబారుపేట బైపాస్ వై జంక్షన్ వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసి… డివైడర్లు సెంట్రల్ లైటింగ్.. గ్రీనరీ ఏర్పాటు చేయటం.

నందిగామ పట్టణ సమీపంలో ఆటోనగర్ మరియు కంచికచర్ల సమీపంలో లారీ స్టాండ్ ఏర్పాటు చేయడం.

నందిగామ పట్టణంలో ప్రజలకు ఆహ్లాద వాతావరణం అందించేలా పార్కు మరియు క్రీడా మైదానం ఏర్పాటు చేయటం.

ఈనాం భూములు 22 ఏ పరిధిలో భూములు నిషేధిత జాబితా నుండి తొలగించడం రైతుపేట చెరువు బజార్ మరియు డివిఆర్ కాలనీ ప్రజలకు పట్టాలు మంజూరు చేయడం.

నిరుద్యోగ యువతకు నందిగామ పట్టణంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ అందించడం.

నందిగామ మరియు కంచికచర్ల లో కాపు కళ్యాణ మండపం నిర్మించుట.

వినాయక నిమజ్జనాలు మరియు కార్తీక మాస పూజలు నిర్వహించుకునేందుకు కీసర మునేటి ఒడ్డున ఘాట్ ఏర్పాటు చేయుట.

నందిగామ, కంచికచర్ల ఆర్టీసీ బస్టాండును ఆధునికరించడం మరియు మండలంలోని అన్ని గ్రామాలను కలిపేలా బస్సు సర్వీసు ఏర్పాటు చేయటం.

కంచికచర్ల చెరువును మంచినీటి చెరువుగా మార్చి చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం.

కంచికచర్ల మహిళా డిగ్రీ కళాశాలను భవనం నిర్మించి విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాలలో కొనసాగుతున్న కళాశాలను కంచికచర్లకు తీసుకురావడం.

కంచికచర్ల నుంచి పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఉన్న రహదారి నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసి డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ ఏర్పాటు చేయడం.

ఏటూరు – మొగులూరు కలిపేలా కృష్ణా నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయడం.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశలు కల్పించేందుకు నందిగామ మండలంలోని పెద్దవరం ఏపీఐఐసీ కారిడార్ వీరులపాడు మండలంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయడం.

చందర్లపాడు మరియు కంచికచర్ల మండలాల పరిధిలో కృష్ణ నదిలో ప్రత్యేకంగా పాయలు ఏర్పాటు చేసి ఎత్తిపోతల పథకాల నిర్వహణకు సరిపడా కృష్ణా జిల్లాలను మళ్లించటం.

నియోజకవర్గానికి రెండు వైపులా ఉన్న కృష్ణా మునేటి నదుల నుంచి నీరు వృధాగా పోకుండా అవసరమైన చోట చెక్ డ్యాంలను నిర్మాణం చేయడం.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మరియు మైనార్టీ వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించుట.

కీసర నుంచి నందలూరు మీదుగా వీరులపాడు వెళ్లే రహదారిని విస్తరించి అభివృద్ధి చేయుట.

కంచికచర్ల పట్టణంలో మూడు మంచినీటి ట్యాంకులు. అంబేద్కర్ కాలనీ, మోడల్ కాలనీ, డివిఆర్ కాలనీలో నిర్మించుట.

కంచికచర్ల, చందర్లపాడు, అల్లూరు, పెండ్యాల గ్రామాల్లో ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిగా అభివృద్ధి.

నందిగామ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని హిందూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు శాశ్వత స్మశాన వాటికలు ఏర్పాటు చేయడం మరియు అభివృద్ధి పనులు చేయడం.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని రైతుల పంట పొలాలకు వెళ్లే డొంక రోడ్లు మరియు ఆయా గ్రామాలను అనుసంధానం చేసే లింకు రోడ్లను అభివృద్ధి చేయటం 

ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here