ఏప్రిల్ 29పులివెందుల నియోజక వర్గంలో సీఎం జగన్ సతీమణి భారతి రెండో రోజు వేంపల్లిలో ప్రచారం చేస్తున్నారు.

Spread the love

 

పులివెందులలో వైయస్  భారతి ప్రచారం

వైయస్సార్ జిల్లా: ఏప్రిల్ 29పులివెందుల నియోజక వర్గంలో సీఎం జగన్ సతీమణి భారతి రెండో రోజు వేంపల్లిలో ప్రచారం చేస్తున్నారు. 

మొదటిరోజు తొండూరు మండలం ఇడమడక గ్రామంలో వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతతో కలిసి ప్రచారం చేశారు. రెండవ రోజు వేంపల్లి పట్టణంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. 

వైఎస్ భారతికి శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి సతీమణి సుమతీరెడ్డి ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థు లను తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

వేంపల్లి పట్టణంలో అడుగ డుగునా భారతిరెడ్డికి స్వాగతం పలికారు. జగన్ అభిమానులు, వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *