ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్

Spread the love

అమరావతి

ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్

అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) జెన్నిఫర్ లార్సన్ నేడు అమరావతి విచ్చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ తో ఆమె భేటీ అయ్యారు. 

జెన్నిఫర్ లార్సన్ తో భేటీపై నారా లోకేశ్ స్పందిస్తూ.అమెరికా కాన్సులేట్ జనరల్ తో సమావేశం సంతోషం కలిగించిందని తెలిపారు. భారతీయ అమెరికన్లలో తెలుగు ప్రజలు 14 శాతం మంది ఉన్నారని, వారు భారత్-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేశారన్న దాంట్లో తనకు ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. వారు తెలుగు సంస్కృతి, సంప్రదాయాల సొగసును అమెరికా గడ్డపై సుసంపన్నం చేశారని, మన వైవిధ్యాన్ని, వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారని లోకేశ్ వివరించారు. ఈ బంధాన్ని మరింత విస్తరింపజేయడంలో ఏపీ మరింత కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నామని తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *