ఏపీయూడ‌బ్ల్యూజే దౌర్జ‌న్యాల‌ను అరిక‌ట్టండి..విజ‌య‌వాడ ప్రెస్‌క్ల‌బ్‌ను అంద‌రిదిగా మార్చేందుకు స‌హాక‌రించండి..

3
0

ఏపీయూడ‌బ్ల్యూజే దౌర్జ‌న్యాల‌ను అరిక‌ట్టండి..
విజ‌య‌వాడ ప్రెస్‌క్ల‌బ్‌ను అంద‌రిదిగా మార్చేందుకు స‌హాక‌రించండి..

  • ప్రెస్‌క్ల‌బ్ పేరు చెప్పి నిధులు దారిమ‌ళ్లిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోండి..*
  • ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల‌పై పూర్తిస్థాయిలో విచార‌ణ చేప‌ట్టండి..
  • *విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన‌తిపత్రం అందించిన జేఏసీ నేత‌లు ..
    విజ‌య‌వాడ‌,
    విజయవాడ ప్రెస్ క్లబ్ మాదే అంటూ ప్రెస్ క్లబ్ లోకి వచ్చే వేరే సంఘం జర్నలిస్టులను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా ప్రెస్ క్లబ్ సాధన సమితి నాయకులు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు,విజయవాడ డిసిపి ఉదయ రాణి లకు పిర్యాదు చేశారు.విజయవాడ జర్నలిస్టుల సంక్షేమం కోసం అలనాటి సీనియర్ జర్నలిస్టు పెద్దల నేతృత్వంలో జులై 1971లో అప్పుటి ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి “ప్రెస్ క్లబ్, విజయవాడ” కు శంకుస్థాపన చేశారని, అయితే “ప్రెస్ క్లబ్” మాదే అంటున్న ఏపీయూడబ్ల్యూజే హైదరాబాద్ లో ఏప్రియల్ 1975లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా డాక్యుమెంట్స్ కనబడుతున్నాయనీ సిపి దృష్టికి తీసుకెళ్లారు. 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 1975లో రిజిస్టర్ అయిన ఏపీయూడబ్ల్యూజే కు ఎలా చెందుతుంది, అదేవిధంగా అలనాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995లో ప్రెస్ క్లబ్ పేరు తోనే మొదటి అంతస్తును ప్రారంభించి ఉన్నారనీ, ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో ఉన్న 1971 శిలాఫలకంలో కానీ 1995 శిలాఫలములో కానీ ఎక్కడ కూడా ఏపీయూడబ్ల్యూజే అనుబంధమని ప్రస్తావన రాలేదన్నారు. ఇక ఏపీయూడబ్ల్యూజే చెబుతున్న ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ బేలా 264 / 2018 లో ప్రెస్ క్లబ్ తమ అనుబంధం అంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనీ 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 2018 లో కొంతమంది కలిసి చేసుకున్న రిజిస్ట్రేషన్ ఎలా న్యాయ సమ్మతం అని సాధన సమితి నేతలు కమిషనర్ కు తెలిపారు…. ఈ విషయంలో గత రెండు సంవత్సరాల క్రితమే అప్పటి సబ్ కలెక్టర్ నివేదికను కలెక్టర్ కి ఇచ్చి ఉన్నారన్నారు.. అయినా ఏపీయూడబ్ల్యూజే నాయకులు కూడా మీ దృష్టికి తీసుకువచ్చారు.. కాబట్టి మీరు కూడా దయచేసి నిజానిజాలు నిగ్గు తేల్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ ను తమ అదుపులో ఉంచుకున్న ఏపీయూడబ్ల్యూజే నాయకులు విజయవాడ జర్నలిస్టుల సంక్షేమాన్ని మరచి ప్రెస్ క్లబ్ డబ్బును దారి మళ్లించటమే కాక రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థలకు భారీగా బకాయి పడ్డారన్నారు.. అందులో భాగంగా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ వారు కోటి 82 లక్షలకు పైగా కట్టాలని డిమాండ్ నోటీసిస్తూ ప్రెస్ క్లబ్ ను ఖాళీ చేయవలసిందిగా ఇరిగేషన్ శాఖ నోటిస్ ఇచ్చిందన్నారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ నిర్వాహకులుగా ఉన్న వారు వాటర్ టాక్స్ కట్టకపోతే మున్సిపల్ వారు డిస్ కనెక్ట్ చేశారని, అయితే దానిని అనధికారికంగా ఏపీయూడబ్ల్యూజే నేతలు తిరిగి నీటి చౌర్యానికి పాల్పడ్డారని నాలుగు లక్షల 50 వేలు పెనాల్టీని విధిస్తూ మున్సిపల్ వారు నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా “ప్రెస్ క్లబ్ సొంత బిల్డింగ్” కి మాత్రమే ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు జీవో వర్తిస్తుండగా వారు యూనియన్ పేరు మీద జర్నలిస్టుల సంక్షేమ మరిచి ప్రెస్ క్లబ్ ఆదాయాన్ని వాడుతున్నారని ప్రెస్ క్లబ్ ఆదాయం దుర్వినియోగం అవుతుందనీ వారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వారీ ఆడిటే పెద్ద ఉదాహరణ గా పేర్కొన్నారు.. ప్రెస్ క్లబ్ కు 2018 రిజిస్ట్రేషన్ తప్ప దానికి కనీసం బ్యాంక్ ఎకౌంట్ కూడా లేకుండా ప్రెస్ క్లబ్ ఆదాయాన్ని యూనియన్ ఆదాయంగా చూపెట్టుకుంటున్నారన్నారు. ప్రభుత్వ నిధులకు, దాతల ఫండ్స్ కి “ప్రెస్ క్లబ్” అంటూ. జర్నలిస్టుల సంక్షేమం వచ్చేవరకు ఇది యూనియన్ సంబంధించినదని వారు చేస్తున్న వాదనపై విచారణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ లోకి వారి ఇష్టం లేకపోతే జర్నలిస్టులు వస్తే వారిని దుర్భాషలాటమే కాక బయటకు నెట్టు వేసేన సంఘటనలు ఈ మధ్య జరిగాయనీ వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటి మీద కూడా విచారణ చేయవలసిందిగా కోరారు. విజయవాడలో దాదాపు 1500 పైగా అక్రిడేటెడ్ జర్నలిస్టులు, మరో 500 వరకు వివిధ కేడర్లలో జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అయితే ఇప్పుడు ఉన్న ప్రెస్ క్లబ్ కార్యవర్గం కేవలం 122 మందే సభ్యులను, అది కూడా యూనియన్ సభ్యులనే ప్రెస్ క్లబ్ సభ్యులుగా చూపించి కమిటీ ప్రకటించు కున్నారన్నారు. ఆ 122 మందిలో వర్కింగ్ జర్నలిస్టులు అతి తక్కువగా ఉన్నారనీ,. గుంటూరు, కర్నూల్ వారిని కూడా విజయవాడ ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా చూపెట్టారనీ వారు తెలిపారు. అనేక ప్రముఖ పత్రికలకు, ఛానల్ కు, నిజంగా నడుస్తున్న ప్రాంతీయ పత్రికల మీడియా ప్రతినిధులకు మెంబర్ షిప్ లేదనీ,. వారి మెంబర్షిప్ లిస్ట్ మీద కూడా ఎంక్వయిరీ చేసి వర్కింగ్ జర్నలిస్టులో నిర్ధాయించవలసిందిగా కోరారు.దాని పైన మేము అధికారుల దృష్టికి గత మూడు సం. సంవత్సరాల నుంచి తీసుకు వెళ్తూన్నా మని..అందులో భాగంగా గౌరవ సబ్ కలెక్టర్ గారు ఏపీయూడబ్ల్యూజే నాయకుల వద్ద ఏ రకమైన ఆధారాలు లేవు … ఇది అందరూ ప్రెస్ క్లబ్ గా మార్చడం కోసం తగు సూచనలు కలెక్టర్ కి చేసి ఉన్నారన్నారు. కలెక్టర్ గత నెలలో విచారణకు పిలిస్తే ఏపీయూడబ్ల్యూజే నాయకులు హాజరు కాలేదనీ,…. తిరిగి ఈ నెలలోనే వాయిదా ఉన్నదనీ. ప్రెస్ క్లబ్ ను విజయవాడలో ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికి ఉపయుక్తమయ్యే విధంగా, ఏపీయూడబ్ల్యూజే ఆక్రమణ చెర లో ఉన్న “విజయవాడ ప్రెస్ క్లబ్ విజయవాడ జర్నలిస్టులందరి ప్రెస్ క్లబ్ గా నిలబడే విధంగా” మీరు విచారణ చేసి తగు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ప్రెస్ క్లబ్ అందరిది సాధన సమితి నాయకులు సిపిని కోరారు…… సీపీని క‌లిసిన వారిలో విజయవాడ ప్రెస్ క్లబ్ అందరిదీ సాధన సమితి నాయ‌కులు వీర్ల శ్రీరాం యాద‌వ్‌, మహాటివి గాంధీ, కె. ప్ర‌సాద్ బాబు, ఎవివి శ్రీనివాస‌రావు, కె. న‌మ్మ‌య్య‌, చంద‌న మ‌ధు, కాకుమాను వెంక‌ట వేణు, మ‌రీదు ప్ర‌సాద్ బాబు, యామినేని వెంక‌ట‌ర‌మ‌ణ‌, అంత‌రాత్మ శ్రీనివాస‌రావు, తాళ్లూరి అనిల్‌, ఎన్ ఎస్ ఆర్‌, ప‌సుపులేటి చైత‌న్య‌, ప్ర‌శాంత్‌, మానేపల్లి మ‌ల్లిఖార్జున‌రావు, తాడికొండ బాలాజీ, దుర్గం ప్ర‌తాప్‌, దార్ల ఉద‌య్ కుమార్‌, సాయి, న‌ర‌సింహారెడ్డి, నాగ‌వ‌రుణ్‌, బంగార్రాజా, చ‌ర‌ణ్‌, వాసు, శేఖ‌ర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here