ఏడాది కూటమిపాలనలో…ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
0

ఏడాది కూటమిపాలనలో…ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడివాడ 33,34,35 వార్డుల్లో…’సుపరిపాలనలో తొలి అడుగు’ ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే రాము

పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్తూ….ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించిన ఎమ్మెల్యే

గుడివాడ జులై 04: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే….ఇంటింటికి రెట్టింపు సంక్షేమం అందుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.

గుడివాడ పట్టణంలోని 33, 34,35… వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు’ ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము శుక్రవారం ఉదయం నిర్వహించారు.

ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, పార్టీ నేతలతో కలిసి… ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే రాము… ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే వారికి ప్రచార కరపత్రాలను అందచేశారు. వార్డు పర్యటనలో భాగంగా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

పర్యటనలో భాగంగా వార్డుల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే రాము మాట్లాడారు…రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక సమస్యలు తలెత్తిన ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి చ్చిన ఏడాదిలోనే ఇంటింటికి రెట్టింపు సంక్షేమాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో గుడివాడ పట్టణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికల రూపొందించామని, వాటిని ఆచరణలో కూడా పెడుతున్నట్లు ఎమ్మెల్యే రాము తెలియచేశారు.

గుడివాడ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సీనియర్ టిడిపి నాయకులు లింగం ప్రసాద్, పండ్రాజు సాంబశివరావు, నెరసు కాశి, జోన్స్ దయానంద్, చేకూరు జగన్మోహన్రావు, పోలాసి ఉమా, డాక్టర్ మాగంటి శ్రీనివాస్,రెడ్డి షణ్ముఖ, దేవేంద్రుడు, జబిన్, విజయ్…. 33వ వారు టిడిపి నాయకులు కోడూరి ప్రభు, మూడేడ్ల శ్రీధర్,కిషోర్, నేరుసు కాశీ విశ్వనాధ్,Ch. పండు, పెద్ది శ్రీను, పెద్ది వెంకటేశ్వరరావు, మెరుగు మాలకుమార్ బాబు…. 34వార్డు టిడిపి నాయకులు బూరాడ మధుసూదన్, గంటా అజయ్, బడబల్ల హరిబాబు, సురేంద్ర, అన్నమయ్య, చక్రపాణి, కన్న, వెంకటేశ్వరరావు, బాలాజీ , లక్ష్మి….. 35వార్డు నాయకులు గుండుమెడ వెంకట రాఘవేంద్రరావు, కొత్త మురళీకృష్ణ, నాగేశ్వరరావు, కుందేటి ప్రసాదు, గుమ్మడి కృష్ణ, శేషుబాబు, గుమ్మడి వెంకయ్య, కొత్త సుబ్బారావు, వెంకట సుబ్బారావు, అవీరినేని లలిత, మల్లీశ్వరి…స్థానిక ప్రజలు, టిడిపి అనుబంధ విభాగాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here