ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళగిరి ఎయిమ్స్ వద్ద అంబులెన్స్ స్టాండ్ ప్రారంభం అంబులెన్స్ ను ప్రారంభించిన, మాజీ కార్పొరేటర్, విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి కోటేశ్వరరావు

Spread the love

 ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళగిరి ఎయిమ్స్ వద్ద అంబులెన్స్ స్టాండ్ ప్రారంభం

అంబులెన్స్ ను ప్రారంభించిన, మాజీ కార్పొరేటర్, విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి  కోటేశ్వరరావు

మంగళగిరి నగరంలోని ఎయిమ్స్ వద్ద నూతనంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ స్టాండ్ ను, మాజీ కార్పొరేటర్, సిపిఐ విజయవాడ నగర్ కార్యదర్శి జి కోటేశ్వరావు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ అధ్యక్షత వహించారు. అనంతరం ఆటో, అంబులెన్స్ స్టాండ్ వద్దగల ఏఐటీయూసీ జెండాను జి కోటేశ్వరరావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ విజయవాడ సిపిఐ నగర కార్యదర్శి, జి కోటేశ్వరరావు, మాట్లాడుతూరాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఎయిమ్స్ మన ప్రాంతానికి రావడం జరిగింది ఇంకా పూర్తిగా అన్ని విభాగాలు రావలసినటువంటి అవసరం కూడా ఉన్నది కాబట్టి ఈ తరుణంలో ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్స్ ఏఐటీయూసీ యూనియన్ ఏర్పాటు చేసుకుని  ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం అటువంటి మీరందరికి కూడా కమ్యూనిస్టు పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్త,రాబోతున్నటువంటి కాలంలో వాస్తవాన్ని మనం చూసినట్లయితే ఇది వృత్తి కాదు వృత్తి తో పాటు సేవా దృక్పథం కూడా ఎందుకని అంటే రోగులు శతకాత్రులు చనిపోయినటువంటి వారు ఉంటారు. వారందరినీ కూడా గమ్యస్థానానికి తీసుకుని వెళ్లడమే కాకుండా, గమ్యస్థానాల నుంచి హాస్పటల్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. కాబట్టి మనం చూస్తే చనిపోయినటువంటి వారిని ముట్టుకోవడానికి అయితే కూడా కొంతమంది కుటుంబ సభ్యులు వెనకడుగు వేసేటువంటి పరిస్థితులలో ఇటువంటి అంబులెన్స్ ద్వారా సేవ  అందించడం అనేది ప్రప్రథమంగా హాస్పిటల్ కి వచ్చిన తర్వాత సేవ అందించడం కంటే ముందుగా హాస్పిటల్ కి తీసుకువచ్చేటప్పుడే మరి రోగులకి శతకాత్రులు ఎవరైతే ఉంటారో వారికి సేవను అందించే అటువంటి భాగ్యం అంబులెన్స్ నిర్వహించినటువంటి డ్రైవర్స్ కి ఉన్నది కాబట్టి విధి నిర్వహణలో ఏఐటియుసి గా మనందరం కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు న్యాయబద్ధంగా సర్వీసెస్ ఓరియంటేషన్ తో పాటు ప్రజలకు సేవ చేస్తున్నాం సేవతో పాటు మనం మన జీవనోపాధిని మనం నిలబెట్టుకుని మన కుటుంబాలను కాపాడుకుంటున్నాం మన జీవనోపాధిని చేసుకోవాలి కాబట్టి వ్యాపార దృక్పథం కాకుండా మంచిగా ఏఐటీయూసీ అంబులెన్స్ స్టాండ్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని జి కోటేశ్వరరావు కోరారు. *ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు మాట్లాడుతూ* అంబులెన్స్ డ్రైవర్స్, స్టాండ్ కు మంచి పేరు తీసుకురావాలని పేషంట్లను, డెడ్ బాడీలను, తీసుకెళ్లేటప్పుడు,జాగ్రత్త వహించి తీసుకెళ్లాలని పేషంట్ల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకొని ఏఐటియుసి అంబులెన్స్ స్టాండ్ పేరు నిలబెట్టాలని ఎయిమ్స్ అంబులెన్స్ స్టాండ్ డ్రైవర్స్ ను  కోరారు.అందరూ ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. అనంతరం ఎయిమ్స్ హాస్పటల్ డిజిపి ఆఫీసు రోడ్ లో అంబులెన్స్ స్టాండ్ ను  పుప్పాల సత్యనారాయణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఎయిమ్స్ ఆటో స్టాండ్, ఏఐటియుసి అంబులెన్స్ స్టాండ్ కార్మికులు డి చంద్రశేఖర్, కే రవికుమార్, డేవిడ్, సుమన్, రాజ్, *ఎయిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్ స్టాండ్ గౌరవాధ్యక్షులుగా అన్నవరపు ప్రభాకర్, అధ్యక్ష, కార్యదర్శులుగా,జెడ్ సుధీర్, విజయ్ కుమార్, సహాయ అధ్యక్షులుగా, కే దుర్గాప్రసాద్, కే ఆశీర్వాదం, కోశాధికారిగా జి లక్ష్మారెడ్డిని ఎన్నుకున్నారు*.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *