ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలి
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలి
రాజధాని ప్రాంత మహిళ రైతులు అమరావతి రైతు జేఏసీ దళిత జేఏసీ నాయకుల డిమాండ్
రాజధాని ఉద్యమం కోసం మహిళలు నిద్రాహారాలు మాని పోరాటాలు చేశారు
రాజధాని మహిళలపై చేసిన సంస్కారహీనమైన వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే అమరావతి రాజధాని మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి
కృష్ణంరాజు పిచ్చి పరాకాష్టకు చేరిందని మహిళలను దళితులను కించపరిచే ఫ్యూడలిస్ట్ వ్యక్తులను బహిష్కరించాలి
అమరావతి రాజధాని పోరాటంలో ముందు నిలబడిన మహిళలను వేశ్యలు అంటూ కించపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి
అమరావతి రాజధాని ప్రాంతంలో 80% పైగా దళిత ప్రజలు ఉన్నారు
అమరావతి మహిళలను సాక్షి లైవ్ డిబేట్ లో వేశ్యలు అంటూ సంబోధించిన ఎనలిస్ట్ వివి కృష్ణమరాజు, కేఎస్ఆర్, సాక్షి మీడియా ద్వారా జగన్, వైసీపీ పేటీఎం బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ ఆదివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో సిఐవై శ్రీనివాసరావు, గ్రామీణ ఎస్ఐ మహేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాతర్ల రమేష్ దళిత జేఏసీ నాయకులు వేమూరి మైనర్ బాబు, అమరావతి జేఏసీ నాయకురాలు ఆకుల జయ సత్య లు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని అలాంటి అమరావతిపై ఎనలిస్ట్ కృష్ణంరాజు , కొమ్మినేని శ్రీనివాసరావు లు ఇద్దరు సాక్షి మీడియా డిబేట్లో అమరావతి రాజధానిని వేశ్యల రాజధానిని సంబోధించడం ద్వారా వారి యొక్క వికృత చేష్టల ద్వారా అమరావతి రాజధాని ప్రాంత ప్రజల మనోభావాలు కించపరిచారని వారు అన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 80 శాతం దళిత ప్రజలు ఉన్నారని, తాటికొండ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గమని, మంగళగిరి నియోజకవర్గంలో ఎస్సీలు ఎస్టీ బీసీలు మైనార్టీలు ఉన్న నియోజకవర్గం అలాంటి నియోజకవర్గాలలో నివసిస్తున్న మహిళలను వేషాలని సంబోధించిన కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావులపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని సాక్షి టీవీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయాలని వారు కోరారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన మహిళలను కించపరిచే విధంగా వేశ్యలు అనడం అవమానకరమని, రాజధాని మహిళలను అవమానించడం సరైన పద్ధతి కాదని డిబేట్లో అసభ్యకరంగా అలా మాట్లాడుతుంటే సాక్షి యాజమాన్యం ఖండించకపోవడం సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు పిచ్చి పరాకాష్టకు చేరిందని మహిళలను దళితులను కించపరిచే ఫ్యూడలిస్ట్ వ్యక్తులను బహిష్కరించాలన్నారు.బుద్ధిహీనులు రాజధాని మహిళలపై చేసిన సంస్కారహీనమైన వ్యాఖ్యలు కు ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యుడని తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని రాజధాని మహిళలని భేషరతుగా క్షమాపణలు వేడుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యమంలో భూములు ఇచ్చిన రైతులు రైతు మహిళలు దళితులు బీసీ మైనార్టీ వర్గాల వారందరూ నిర్వహించిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించి కలిగినదని పేర్కొన్నారు. అలాంటి పోరాటంలో ముందు నిలబడిన మహిళలను వేశ్యలుగా కించపరుస్తూ మాట్లాడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని వారు అన్నారు. ఫిర్యాదు అందజేసిన వారిలో అమరావతి దళిత జేఏసీ నాయకులు అమరావతి రైతు జేఏసీ నాయకులు, తోట సాంబయ్య, ఈపూరి పెద్దబ్బాయి, వడ్డేశ్వరపు ప్రసాదరావు, బొక్క నాగరాజు, ఎలమంచిలి పద్మజ ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు అందజేశారు.