ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులకు సంక్షేమ పథకాలు అమలు.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
గంగినేనిపాలెంలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు.’
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 27.07.2025.
కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా అందుతున్నాయని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
జి.కొండూరు మండలంలోని గంగినేనిపాలెం గ్రామంలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు వర్తింపు గురించి లబ్ధిదారులను ప్రశ్నించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు కూడా స్వీకరించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తన పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని పండగ వాతావరణంలో జరుగుతుందన్నారు.
ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు.
సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. కీలక ప్రాజెక్టుల వివరాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు.
ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన పనులను ప్రజల ముందు ఉంచడంతో పాటు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా ఈ ప్రచారంలో అవగాహన కల్పించారు.
ప్రజా భాగస్వామ్యంతో పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే దిశగా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ, దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, 16,347 పోస్టులతో డీఎస్సీ, 8.5లక్షల మందికి ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
సూపర్ సిక్స్ పథకాలతో పాటు పేదల సంక్షేమం, పరిశ్రమల స్థాపన, పెట్టుబడులతో ఉద్యోగ కల్పన, ప్రాజెక్టుల పునరుద్ధరణకు కృషి జరుగుతోందన్నారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ అమలు, అన్న క్యాంటీన్లతో 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో ఎన్నికల హామీలను కూటమి సర్కారు నిలబెట్టుకుంటుందన్నారు.
మన బిడ్డల బంగారు భవితకు ప్రధాని మోదీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.