
ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ఎల్ ఓ సి అందజేత
ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారం తో మంజూరైన
( లెటర్ అఫ్ క్రెడిట్) ఎల్ ఓసీ ను 42 వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్,కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసిఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు.
51 వ డివిజన్ , కొత్త పేటకు చెందిన గొన్న రామాయమ్మ హృద్రోగంతో బాధపడుతు
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
తనకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో
వైద్యం సాయం కొరకు దరఖాస్తు చేశారు.
మంజూరైన రూ 5 లక్షల 52 వేల ఎల్ ఓసీ ను బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు
త్వరితగతిన ఎల్ ఓసీ ను మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు అలీ, భావి శెట్టి శ్రీనివాస్, నల్లపురెడ్డి అప్పారావు, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు ..
![]()
