ఎమ్మెల్యే సుజనా చౌదరి దాతృత్వం…నిరుపేద కుటుంబానికి నిత్యవసరాలు పంపిణీ …

Spread the love

ఎమ్మెల్యే సుజనా చౌదరి దాతృత్వం…
నిరుపేద కుటుంబానికి నిత్యవసరాలు పంపిణీ …

ఎమ్మెల్యే సుజనా చౌదరి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు .

మెంథా తుఫాన్ కారణంగా నష్టపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 46 వ డివిజన్, లంబాడి పేట కొండ ప్రాంతంలో నివాసముంటున్న హరీష్ ,నందిని ల కుటుంబానికి ఒక నెలకి సరిపడ బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు..

మెంథా తుఫాన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన బాలింత నందిని , తన నెలల పిల్లలతో ఇబ్బంది పడుతుందని వారి కుటుంబానికి సాయం అందించాలని 47 వ డివిజన్ బీజేపీ ఎస్ సీ మోర్చా మహిళా అధ్యక్షరాలు ఆకారపు విజయ కుమారి ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే సుజనా ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ 25 కేజీల బియ్యం , ఒక నెలకు సరిపడ నిత్యావసర సరుకులను భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో అందించారు..

మానవతా దృక్పథం తో నిత్యవసర సరుకులను అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారం మరువలేనిదని బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సుజనా మిత్రా కోఆర్డినేటర్ సప్పా శ్రీనివాస్ పాల్గొన్నారు..

Loading