ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల మీదుగా 43-50-51, వ డివిజన్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు

3
0

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం

ప్రజా ప్రతినిధులందరం ఐక్యంగా ముందుకు వెళ్దాం ‌‌

శంకుస్థాపనల కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి

ప్రజా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ రాజకీయాలకతీతంగా సేవలందిస్తూ ప్రజా ప్రతినిధులందరం ఐక్యంగా కలిసి ముందుకెళ్దామని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు..

పశ్చిమ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూటమినేతలతో కలిసి రూ 1 కోటి 43 లక్షల 17 వేల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు .

43 వ డివిజన్ , కనకదుర్గ రెడ్డి కాలనీలో రూ 23.07 లక్షలతో చేపట్టనున్న సీ సీ రోడ్లు, కల్వర్టులు , ప్రజాశక్తి నగర్ లో రూ 32 లక్షలతో చేపట్టనున్న సీ సీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వైసీపీ కార్పొరేటర్ భాపతి కోటిరెడ్డి,కూటమినేతలతో కలిసి శంకుస్థాపన చేశారు.

50 వ డివిజన్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతంలో రూ సుమారు రూ 50 లక్షలతో చేపట్టనున్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కూటమినేతలతో కలిసి శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా 51 డివిజన్ శ్రీనివాస్ మహల్ బ్యాక్ సైడ్ కొండ ప్రాంతంలో రూ 38.82 లక్షలతో చేపట్టనున్న సీ సీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, పడాల వారి వీధి కొండ ప్రాంతంలోని మెట్ల మరమత్తుల పనులకు, వాటర్ పైప్ లైన్ మరమత్తులకు టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్, మరియు కూటమి నేతలతో కలిసి శంకుస్థాపనలు చేశారు..

రాజకీయాలను పక్కన పెడదాం..

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటు ప్రజా ప్రతినిధులందరం ఐక్యంగా ముందుకు వెళ్దామనీ సుజనా పిలుపునిచ్చారు.. వైసీపీ కి చెందిన కార్పొరేటర్ భాపతి కోటిరెడ్డి చురుగ్గా పనిచేస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు.
పశ్చిమ అభివృద్ధిలో మేయర్ భాగస్వామ్యం కూడా అవసరమని అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మేయర్ కూడా పాల్గొనాలనీ సుజనా పిలుపు నిచ్చారు.. పశ్చిమ అభివృద్ధి కోసం మేయర్ కూడా తమతో కలిసి రావాలని
తన మాటగా చెప్పమని కార్పొరేటర్ భాపతి కోటిరెడ్డి ను ఎమ్మెల్యే సుజనా కోరారు.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్దామని అన్నారు .. మరి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సుజన సూచించారు.
నాణ్యతా ప్రమాణాలను పాటించి అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో ఈ ఈ శ్రీనివాసరావు, డీ ఈ పురుషోత్తం, కరుణాకర్, ఎ ఈ ఖలీల్,
శ్రీనివాసరావు, రామకృష్ణ కార్పొరేటర్లు మరుపిళ్ల రాజేష్ ,బుల్లా విజయ్ కుమార్, మైలవరపు రత్నకుమారి దుర్గారావు, మహాదేవు అప్పాజీరావు,అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు, గుడివాడ నరేంద్ర రాఘవ, మైలవరపు మాధురి లావణ్య, కూటమి నేతలు యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు , తిరుపతి సురేష్,బొల్లేపల్లి కోటేశ్వరరావు,మైలవరపు కృష్ణ, పగడాల కృష్ణ, వై విశ్వేశ్వరరావు , కొనికి కొండయ్య, మోరబోయిన రాంబాబు, కొప్పుల గంగాధర్, రెడ్డిపల్లి గంగాధర్,
దాడి అప్పారావు,సుజనా మిత్రా కోఆర్డినేటర్లు శివకుమారి, మొక్క భవాని, జ్యోత్న్స ప్రియ, తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here