ఎమ్మెల్యే సుజనా చౌదరి ఔదార్యం మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ఇటీవల 41 వ డివిజన్ లో అనారోగ్యంతో మరణించిన
కే మణెమ్మ (75) కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
నిరుపేదలైన అయిన మణెమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని 41 వ డివిజన్ బీజేపీ నాయకులు వినోద్ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది భవానిపురం , రంగూన్ సాహెబ్ వీధి లోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు మృతురాలి మనుమరాలు రజనికి రూ 5 వేల నగదు ఆర్థిక సాయం చేశారు.
కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సుజనాకు మృతురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కూటమినేతలు జ్ఞాన బాలన్, కురాకుల సురేష్, గడ్డిపాటి కిరణ్,కార్యాలయ సిబ్బంది చింతా సృజన్ (బాబీ), సుజనా మిత్రా కోఆర్డినేటర్లు టీ తిరుపతి రెడ్డి, కొల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు..