ఎమ్మెల్యే సుజనా చౌదరి ఔదార్యం మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

6
0

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఔదార్యం మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాన్సర్ తో మరణించిన డొక్కా మెర్సీ (15) కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
నిరుపేద కుటుంబం అయిన డొక్కా మెర్సీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని 55 వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ జాహిద్ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మృతురాలి తండ్రి డొక్కా రాజేష్ కు గురువారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కొంతమేర నగదు ఆర్థిక సాయం చేశారు. కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సుజనాకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి దుర్గారావు ,మహాదేవు అప్పాజీరావు , అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు, కూటమినేతలు మైలవరపు కృష్ణ, దుర్బేసుల హుస్సేన్, పోతిన భేసు కంటేశ్వరుడు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు కసింకోట మల్లీశ్వరి సుజనా మిత్రా కోఆర్డినేటర్ సంధ్యారాణి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here