ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ లోని రోడ్లు డ్రెయిన్లు తాగునీటి కుళాయిలను ఆధునికరించి అభివృద్ధి చేసే బాధ్యత

Spread the love

 డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ 

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ లోని రోడ్లు డ్రెయిన్లు తాగునీటి కుళాయిలను ఆధునికరించి అభివృద్ధి చేసే బాధ్యత

ను తీసుకుంటామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. జోనల్ కమిషనర్ బి రమ్య కీర్తన ఇతర అధికారులతో కలిసి బుధవారం 40వ డివిజన్లోని బ్యాంకు సెంటర్ కోళ్ల ఫారం రోడ్డు గాంధీ బొమ్మ సెంటర్ బాల భాస్కర్ రావు పేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. రోడ్లు పారిశుద్ధ్య నిర్వహణ డ్రెయిన్లు తీరును పరిశీలించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాల భాస్కర నగర్ లో వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలియజేయగా సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని ప్రత్తిపాటి శ్రీధర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.ఖాళీ స్థలాలలో పేర్కొన్న చెత్తను తొలగించి డ్రెయిన్లు పూడిక తీసి మురుగునీరు సక్రమంగా పూర్తిస్థాయిలో పారుదల అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జోనల్ కమిషనర్ రమ్య ప్రియ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.నివాసాల మధ్య చెత్తను వ్యర్ధాలను వేస్తే జరిమానా విధిస్తామన్నారు. డ్రైయిన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా మురుగు వర్షపునీటిపారుదలకు ఆటంకాలు కలగకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో 40 డివిజన్ టిడిపి అధ్యక్షులు పివి సుబ్బయ్య ఏ ఈ అహ్మద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గ్రంథం ప్రసాద్ ఏఈ రవీంద్ర కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *