ఎమ్మెల్యే సుజనా చౌదరిఆపన్న హస్తం

10
0

ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఆపన్న హస్తం

చిన్నారి వైద్యానికి
రూ 20 వేలు
ఆర్థిక సాయం

శ్వాస కోశ సమస్యతో బాధపడుతున్న మూడు సంవత్సరాల చిన్నారి శ్రీరాం అభిరా జాయ్ కు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం అందించారు .

35 వ డివిజన్ బాప్టిస్ట్ నగర్ కు చెందిన శ్రీరాం విందేష్ , అనిత దంపతుల కుమార్తె అభిరా జాయ్ పుట్టుకతో శ్వాసకోశ సమస్యతో బాధపడుతుంది..

తనకి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్వాస కోశ సంబంధిత ( ట్రాకియోస్టమీ) చికిత్స చేయిస్తున్నారు.

డ్రైవర్ గా పనిచేస్తున్న చిన్నారి తండ్రి విందేష్ తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని తన కూతురు మెరుగైన వైద్యానికి సాయం అందించాలని తన పరిస్థితిని ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు.

చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే సుజనా వైద్య ఖర్చుల నిమిత్తం రూ 20 వేలను అందించాలని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను ఆదేశించారు.

సుజనా ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సుజనా ఫౌండేషన్ ద్వారా రూ 20 వేలను అందించారు.
త్వరితగతిన స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం సాయం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here