ఎమ్మెల్యే సుజనాకు కృతజ్ఞతలు తెలిపిన ఊర్మిళా నగర్ వాసులు..

Spread the love

ప్రజల భద్రత , నిఘా కోసం
సీ సీ కెమెరాల ఏర్పాటు..

ఎమ్మెల్యే సుజనాకు కృతజ్ఞతలు తెలిపిన ఊర్మిళా నగర్ వాసులు..

టీడీపీ డివిజన్ అధ్యక్షులు మోరబోయిన రాంబాబు ను అభినందించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, భవానిపురం ఎస్ఐ సుమన్..

43 వ డివిజన్ లో సీ సీ కెమెరాల ఏర్పాటు కు సహకరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలుపుతూ కెమెరాలను ఇన్ స్టాల్ చేయడానికి అవసరమైన సామగ్రిని అందించిన టీడీపీ డివిజన్ అధ్యక్షుడు మొరబోయిన రాంబాబు ను అభినందిస్తున్నామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎస్ ఐ సుమన్ అన్నారు..

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో “సుజన ఫౌండేషన్” సహకారంతో సీ ఐ ఉమామహేశ్వరరావు సూచనల మేరకు 43 వ డివిజన్ లో
సీ సీ కెమెరాలను ఏర్పాటు చేయదలిచారు.

43 వ డివిజన్ ,ఏకలవ్య నగర్, ప్రజాశక్తి నగర్, సీతారెడ్డి బొమ్మా రెడ్డి నగర్ ,నులకపేట తదితర ప్రాంతాల్లో సీ సీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

ఊర్మిళానగర్ పార్కు సెంటర్ నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, భవానిపురం ఎస్ఐ సుమన్ ముఖ్య అతిథులుగా పాల్గొని 14 సీసీ కెమెరాలను వారి చేతుల మీదుగా అందించారు.

సీ సీ కెమెరాలను ఇన్ స్టాల్ చేయడానికి అవసరమైన సామగ్రిని అందించిన టీడీపీ డివిజన్ అధ్యక్షుడు మొరబోయిన రాంబాబు ను వారు అభినందించారు.సీ సీ కెమెరాల ఏర్పాటు తో నేరాలను అదుపు చేయవచ్చని ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ ఐ సుమన్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సూచించారు.

సీ సీ కెమెరాల ఏర్పాటు కు సహకరించిన ఎమ్మెల్యే సుజనా కు ఊర్మిళ నగర్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గోళ్ళ విశ్వేశ్వరరావు, కూరాకుల రామచంద్ర రెడ్డి,గుమ్మ బాలు, కాకర్ల కోటి, మోరబోయిన శ్రీను, పెన్నా ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు…

Loading