ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ని కలసిన వి.ఒ.ఏలు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 29.06.2024.
మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు, మైలవరం మండలాల్లో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వి.ఒ.ఏలు) (గ్రామైక్య సంఘాల సహాయకులు) (బుక్ కీపర్లు) (యానిమేటర్లు) శనివారం మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని వారంతా కలసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ మహాకూటమి అధికారంలోకి రావడంతో పాటు, ఏపీలో ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతల స్వీకరణ, మైలవరం ఎమ్మెల్యేగా వసంత వెంకట కృష్ణప్రసాదు రికార్డు స్థాయిలో మెజారిటీతో గెలుపొందడంతో వి.ఒ.ఏలు హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ విధినిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని వారికి సూచించారు. సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పేదరిక నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఏపీ వెలుగు వి.ఒ.ఎల అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, తదితరులు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని కలిశారు.