విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గొర్తి శ్రీనివాస చక్రవర్తిలపై ఆరోపణలు కేవలం అపార్ధం చేసుకోవటం వలనే చేశానని వాంబేకాలనీ కి చెందిన గృహిణి మేకల సుభాషిని వివరణ ఇచ్చారు
. తన భర్త, అత్తమామలు పదే పదే గొర్తి శ్రీనివాస చక్రవర్తి పేరును వాడి మాకేం భయంలేదు మా వెనక గొర్తి చక్రవర్తి ఉన్నాడని చెప్పడంతో తప్పుగా అర్థం చేసుకొన్నానని చెప్పారు. దీంతో తాను ఆత్మహత్య చేసుకునే సమయంలో తీసిన సెల్ఫీ వీడియోలో గొర్తి చక్రవర్తి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పేర్లను ప్రస్తావించడం జరిగిందని అపార్ధం చేసుకున్నా క్షమించాలంటూ వేడుకొంది.
వాంబే కాలనీ హెచ్ బ్లాకు వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మేకల సుభాషిని మాట్లాడుతూ
అత్తా,మామ,బర్తల వేధింపుల కారణంగా ఇటివల తన కూతురితో కలిసి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు చెప్పారు.
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత NTR జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి ల పై ఆరోపణలు కేవలం అపార్ధం చేసుకోవటం వలనే చేశానని స్పష్టం చేశారు. గత కొన్ని ఏళ్ళుగా నా భర్తతో, అత్తమామలతో గొడవలు జరుగుతున్నాయని
కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వ్యవహారంలో కూడా వివాదాలు జరిగాయన్నారు
తనకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ ను,ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విన్నవించుకున్న ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పెద్దమనుషుల సూచనలు సలహాలు మేరకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ను కలిసి తన సమస్యను విన్నవించుకోగా విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గొర్తి శ్రీనివాస చక్రవర్తి వద్దకు వెళ్ళమని ఎమ్మెల్యే బోండా ఉమా సలహా ఇచ్చారన్నారు
విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో, భర్త కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించి రాజీ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు
తన భర్త, అత్తమామలు , గొర్తి శ్రీనివాస చక్రవర్తి పేరును పదే పదే వాడి మాకేం భయంలేదు మా వెనక గొర్తి చక్రవర్తి ఉన్నాడు అని చెప్పడంతో వారిని తప్పుగా అర్థం చేసుకొని తాను ఆత్మహత్య చేసుకునే సమయంలో తీసిన సెల్ఫీ వీడియోలో గొర్తి చక్రవర్తి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పేర్లను ప్రస్తావించడం జరిగిందని స్పష్టం చేశారు.తన భర్తతో అత్తమామలతో జరుగుతున్న గొడవలు వివాదాల నేపథ్యంలో నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని రక్త శాతం కూడా 4 శాతం ఉండటం, ఆత్మహత్య చేసుకునే సమయంలో తాను పూర్తి స్పృహలో లేనని తనకు అన్యాయం జరిగిందనే బాధలో ఎమ్మెల్యే బోండా ఉమా శ్రీనివాస చక్రవర్తి పేర్లను ప్రస్తావించవలసిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
హాస్పటల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తాను నిజం తెలుసుకొని ఎమ్మెల్యే బోండా ఉమా, శ్రీనివాస చక్రవర్తి ప్రమేయం లేదని నిర్ధారణకు రావడం జరిగిందని చెప్పారు ఒక డిజిటల్ మీడియా సంస్థకు చెందిన వ్యక్తి తనతో శ్రీనివాస చక్రవర్తి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్లను చెప్పాలని బలవంతంగా పదే,పదే ఒత్తిడి తెచ్చారన్నారు
తన కుటుంబ తగాదాలు ఆస్తి విషయంలో జరుగుతున్న వివాదాలలో ఎమ్మెల్యే బోండా ఉమా, శ్రీనివాస చక్రవర్తికి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేశారు. ఎమ్మెల్యే బోండా ఉమా శ్రీనివాస చక్రవర్తి నాకు న్యాయం చేయాలని శతవిధాల ప్రయత్నం చేశారని వారిపై నాకు పూర్తి నమ్మకం ఉందన్నారు
నా భర్త అత్తమామలపై పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని పిల్లలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే బోండా ఉమా తో కలిసి మరొకసారి అవకాశం కల్పించాలని ఆమె కోరారు.
సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ శ్రీనివాస చక్రవర్తి పేర్లను బలవంతంగా చెప్పించిన ఆ మీడియా ప్రతినిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె డిమాండ్ చేశారు