
05-11-2025
ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో రైతులపై దండయాత్రకు వెళ్ళాడు : మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న
ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియా సమావేశం
జగన్ మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం
సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ జగన్ కి లేదు
చంద్రబాబు కుటుంబం రైతు కుటుంబం
జగన్ కుటుంబం మైనింగ్ కుటుంబం…రైతు కుటుంబం కాదు
ప్రజల తరుఫున పోరాడటమే సీఎం చంద్రబాబు ధ్యేయం
విజయవాడ : కృష్ణాజిల్లాలో రైతుల పరామర్శకు అంటూ వెళ్లి పూలవర్షం కురిపించుకున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ రెడ్డి… ఎవరైనా చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినా కూడా ఇలాగే పూలు వేయించుకుంటాడంటూ మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. రైతులు ఓట్లు వేయలేదన్న అక్కసుతో పరామర్శ పేరుతో జగన్ మోహన్ రెడ్డి రైతులపై కి దండయాత్ర లాగా వెళ్లాడని మండిపడ్డారు. రైతులపై ప్రేమ, సానుభూతి వుంటే కట్టమీద పోలాలు వున్న ప్రాంతంలో జగన్ పర్యటించాలి. కానీ జగన్ ఏ పోలంలోకి దిగి రైతులను పరామర్శించలేదన్నారు.
కృష్ణ జిల్లాలో ఎమ్మెల్యే వై.ఎస్.జగన్ రైతుల పరామర్శ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పై చేసిన విమర్శలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న బుధవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి కి లేదన్నారు. వై.ఎస్.జగన్ కుటుంబం మైనింగ్ కుటుంబం..ఫ్యాక్షన్ కుటుంబం, కాబట్టి రైతు సమస్యల గురించి ఏమి తెలియదన్నారు.
అందుకే జగన్ తన పాలనలో మూడేళ్ల పాటు ఫసల్ భీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్మును చెల్లించలేదని తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తో సమన్వయం చేసుకుంటూ డబ్బులు చెల్లించి 92 శాతం మంది రైతులకు భీమా అందేలా చూడటం జరిగిందన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఫసల్ భీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించ లేదని మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. అలాగే ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే…15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పటం జగన్ అబద్ధాలకు పరాకాష్ట అన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులను పోలాల్లోకి దిగి పరామర్శించారని, వై.ఎస్. జగన్ మాత్రం ప్రధాన మార్గం నుంచి ప్రయాణిస్తూనే రైతులను పరామర్శిస్తాడన్నారు. రైతులను పరామర్శించటానికి వెళ్లిన అంత మందీ మార్భలం ఎందుకు అంటూ ప్రశ్నించారు. రైతుల పరామర్శకు వెళ్లే నాయకులు కార్లు,బైక్ లు, పెయిడ్ ఆర్టిస్టులతో ర్యాలీగా చేయటం అవసరమా అంటూ నిలదీశారు. తుఫాన్ కారణంగా పంట నష్టపోయి బాధల్లో వున్న రైతులను అవహేళన చేసేందుకే అన్నట్లు రైతుల పరామర్శ పేరుతో దండయాత్ర కార్యక్రమానికి రూపకల్పన చేశాడన్నారు.
తుఫాన్ రావటానికి వారం రోజుల ముందే బెంగుళూరు పారిపోయి, తుఫాన్ తగ్గిన వారం తర్వాత రాష్ట్రానికి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి రైతులను పరామర్శించే హక్కు నైతికంగా కోల్పోయారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ తుఫాన్ సమయంలో రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేశారని తెలిపారు.
సీఎంగా వున్న సమయంలో ఒకసారి పొలంలోకి దిగని ఎమ్మెల్యే జగన్ బురద లేని చోట మట్టి అంటకుండా పర్యటన బాగా చేశాడన్నారు. జగన్ ఎన్ని డ్రామాలు ఆడిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సీఎం చంద్రబాబు ను విమర్శించినంత మాత్రాన ఆయన ఛరిష్మాకు ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. జగన్ మోహన్ రెడ్డి దండయాత్రలను మానుకొని ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు.
ప్రకృతి విపత్తులను ఆపటం ఎవరికీ సాధ్యం కాదని, సీఎం చంద్రబాబు నాయుడు లెటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఎక్కువ మోతాదులో నష్టం లేకుండా నివారణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలందర్నీ ముందుగానే అప్రమత్తం చేయటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ సమయంలో సమర్ధవంతంగా పనిచేసిందని, ప్రభుత్వం చర్యలను ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే జగన్ కు ఎలాంటి మంచి కనిపించదని, అబద్ధాలు, అసత్యాలు తో మోసాలు చేయడమే జగన్ కు తెలిసిన విద్య అన్నారు. విజయవాడ వరదల సమయంలో ఇస్తానని ప్రకటించిన కోటీ రూపాయాలు ఎవరికి ఇచ్చాడో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక సంపన్నుడిగా వై.ఎస్.జగన్ రెడ్డి తన అఫిడవిట్ లో పేర్కొన్న జగన్ రెడ్డి కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడో అర్ధం కావటం లేదన్నారు.
ప్రజల సమస్యలపై పోరాడటమే సీఎం చంద్రబాబు ద్యేయమన్నారు. సీఎం చంద్రబాబు ఒక పడి లేచిన కేరటమన్నారు. చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేసిన సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చారని, జగన్ 42 వేల కోట్లు దోచుకోని జైలుకు వెళ్లాడన్నారు. చంద్రబాబు ను జగన్ తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూడా ఇబ్బందులు పెట్టాలని ఎంక్వైయిరీలు వేసినా ఉపయోగం లేకుండా పోయాయన్నారు.. సీఎం చంద్రబాబు ఒక ఆకాశం లాంటి వారని, ఆయన పై బురద జల్లాలని చూస్తే ఆ బురద వారి ముఖంపైనే పడుతుందన్నారు. ఎమ్మెల్యే జగన్ ఇలా ఇష్టం వచ్చిన రీతాలో మాట్లాడితే ప్రజలు ఈసారి ఇప్పుడిచ్చిన ఆ 11 సీట్లు లాక్కుంటారని హెచ్చరించారు.
![]()
