
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 13మంది లబ్దిదారులకు ₹7,48,358/- రూపాయల సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను అందించడం జరిగింది
ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపుతున్నాం -MLA బొండా ఉమ
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ధి:-8-11-2025 శనివారం ఉదయం సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గంలోని 24, 58 డివిజన్ లకు చెందిన 13 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కు నమోదు చేసుకున్న వారికి ₹7,48,358/- రూపాయల విలువ చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అందజేయడం జరిగింది…
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలెవరూ వైద్య ఖర్చుల నిమిత్తం అప్పులు పాలు కాకూడదన్న సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు సెంట్రల్ నియోజకవర్గ MLA కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద ప్రజలకు సకాలంలో CMRF చెక్కులు, LOC లు అందజేస్తున్నామని…
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికైన తర్వాత, పేదల సమస్యలకు పరిష్కారం చూపిస్తు, ప్రజల కష్టాలను తీరుస్తు, అధికారం కేవలం అలంకారం కాకుండా, గొప్ప బాధ్యత గా తాను, కార్యాలయం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ, వారి కష్టాలను తీర్చడానికి కృషి చేస్తున్నామని…
గతంలో, 2014-2019 మధ్య తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు 30 కోట్ల రూపాయలు ప్రజలకు సహాయం చేశాం అని, తిరిగి 2024 లో అధికారం లోకి వచ్చిన 17 నెలల్లో, దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు తీసుకొని ప్రజలకు అందిస్తు, ఆపదలో సహాయం కోసం వచ్చిన ప్రతి అర్జీని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, చెక్కులు రాపించి, వాటిని గౌరవంగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని…
ముఖ్యమంత్రి సహాయ నిధికి నమోదు చేసుకున్న లబ్ధిదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా, మా కార్యాలయం నుంచే సిబ్బందిని పంపి, సమస్యలను పరిష్కరించి, చెక్కులు తీసుకొని వచ్చి, లబ్ధిదారులకు అందజేస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యామని, వారి కష్టాలను తీర్చడంలో కృషి చేస్తున్నామని, ప్రజల సంక్షేమమే మా లక్ష్యం, వారి ఆశీస్సులతోనే ముందుకు సాగుతాం, ప్రతి ఒక్కరి సమస్యను వ్యక్తిగతంగా పరిగణించి, పరిష్కారం చూపడానికి ప్రయత్నిస్తు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాం అని తెలియజేసారు…
ఈ కార్యక్రమంలో:- 58వ డివిజన్ అధ్యక్షులు కూర్మాపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి మల్లంపాటి రవికుమార్, ఇంచార్జ్ పిరియ సోమేశ్వరరావు, 24వ డివిజన్ ప్రధాన కార్యదర్శి గుడ్డెటి మురళి, గడ్డం రాజు, గాజుల రవి, 24వ డివిజన్ మహిళా అధ్యక్షులు దుర్గా, సుల్తానా, రజిని, తదితరులు పాల్గొన్నారు…
![]()
