ఎన్.టి.ఆర్.పోలీసు కమీషనరేట్ నందు మరో సరికొత్త కార్యక్రమం ఆరోగ్య సురక్షా

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ.18.11.2025

ఎన్.టి.ఆర్.పోలీసు కమీషనరేట్ నందు మరో సరికొత్త కార్యక్రమం ఆరోగ్య సురక్షా

అత్యవసర సమయాలలో చేయవల్సిన ప్రధమ చికిత్స పై పోలీసు సిబ్బందికి అవగాహనా కార్యక్రమం

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో మరో సరికొత్త కార్యక్రమానికి నాంది.

అత్యవసర సమయాలలో ప్రధమ చికిత్స చేయడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడగలమని, ఏదైనా ప్రమాధం జరిగినప్పుడు అందరికంటే సంఘటనా స్థలానికి వెంటనే చేరుకునే మొదటి వ్యక్తి పోలీసు అని, ప్రతిఒక్క పోలీసు ప్రధమ చికిత్సపై అవగాహన కలిగి ఉండాలనే సధుద్దేశంతో ఈ రోజు పోలీసు కమీషనర్ వారి కార్యాలయం, కాన్ఫరెన్స్ హాలు నందు ప్రొఫెసర్ డా. కోలా విజయ శేఖర్ ఆద్వర్యంలో పోలీసు సిబ్బందికి ప్రధమ చికిత్స పై శిక్షణ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమం లో డాక్టర్ మాట్లాడుతూ…… అత్యవసర సమయాలలో ప్రధమ చికిత్స చేయడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడగలమని,సి.పి.ఆర్ ఏ విధంగా చేయాలి, అధిక రక్తస్రావం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో చేయవల్సిన ప్రధమ చికిత్స గురించి విపులంగా వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో  అడ్మిన్ డి.సి.పి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. ఏ.ఆర్.ఏ.డి.సి.పి.  కె కోటేశ్వరరావు  ఏ.ఆర్.ఏ.సి.పి. ప్రేమ్ కుమార్,ప్రొఫెసర్ డా.కోలా విజయ శేఖర్ ఆర్.ఐ.లు. మరియు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు.

Loading