ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

4
0
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

*శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపండి, మీ సేవలు చిరస్మరణీయం…  పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్*
*సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పదవి వీరమణ పొందడం అభినందనీయం.*
*ఇన్ని రోజులు చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించారు, మనమంతా ఒకే పోలీసు కుటుంబం.*
*పోలీసు డిపార్ట్మెంట్ లో ప్రజా సేవకే మీ సమయం, శక్తి అన్ని వినియోగించినందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు.* 
ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి ఈ రోజు పదవీ విరమణ చేయనున్న ఆరుగురు పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు పోలీస్ కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., డి.సి.పి.లు గౌతమీ షాలి ఐ.పి.ఎస్., కృష్ణమూర్తి నాయుడు  మరియు పోలీస్ అధికారులు కలిసి సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించినందుకు గాను పదవీ విరమణ చేయు అధికారులను అభినందించి పోలీస్ మర్యాదలతో శాలువాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికినారు.
*పదవీవిరమణ పొందిన వారి వివరాలు :*
*క్ర.సం*          *పేరు*                    *హోదా* *విధులు నిర్వహణ*
(1) డి.ఆనంద్ కుమార్ సబ్ఇన్స్పెక్టర్అఫ్ పోలీస్ సి.ఎస్.బి.
(2)         ఆర్.రామనాధం రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ సి.ఏ.ఆర్
(3) కె.పెద్దిరాజులు   అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ మాచవరం
(4) కె. ఇమ్మానియేల్   అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ గుణదల 
(5) డి.వి.శ్రీనివాసరావు     హెడ్ కానిస్టేబుల్ సి.సి,ఎస్,
(6) ఎస్.ప్రసాద్ హోంగార్డు హోంగార్డు ఆఫీస్
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., డి.సి.పి.లు గౌతమీ షాలి ఐ.పి.ఎస్.,  కృష్ణ మూర్తి నాయుడు, ఏ.ఆర్.ఏ.సి.పి. డి.ప్రసాద రావు, ఏ. ఓ. సునీత ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎం. సోమయ్య, అసోసియేషన్ సంఘ సభ్యులు, పదవీవిరమణ చేయుచునన్న పోలీసుల కుటుంబాలు మరియు అధికారులు, సి.పి.ఓ. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here