ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ.
తేదీ.30-07-2025.
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆకాశమే హద్దుగా అవగాహనా కార్యక్రమాలు
సెల్ఫ్ డిఫెన్స్ పై మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల పై విధ్యార్ధినీ విధ్యార్ధులకు అవగాహన కల్పిస్తున్న మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు మరియు శక్తి టీం బృంధాలు.
మహిళలు మరియు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి మహిళలకు, విధ్యార్ధినీ విధ్యార్ధులకు శక్తి యాప్, 112 (అత్యవసర సేవలు), 1930 (సైబర్ మోసాల నివేదికల కోసం), 1098 (బాలల హెల్ప్‌లైన్), 181 (మహిళల హెల్ప్‌లైన్), 1073 (ట్రాఫిక్ సమాచారం కోసం), 101 (ఫైర్ ఎమర్జెన్సీ) వంటి కీలకమైన టోల్-ఫ్రీ నెంబర్ లపై విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా ఆపద సమయాలలో ప్రజలకు మేము ఉన్నాం అనే భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ మహిళా పోలీసు స్టేషన్ ఎ.సి.పి. టి.దైవ ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్.టి.ఆర్. పోలీసు కమిషనరేట్ పరిదిలోని శక్తి టీం బృంధాలు, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు మరియు బాలికలకు వారి రక్షణకు కల్పించబడిన మహిళా చట్టాల గురించి శక్తి యాప్ వలన కలిగే ఉపయోగాలు గురించి వివరించడం జరుగుతుంది.
ఈ నేపధ్యంలో ది.29.07.2025 తేదీన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని కె.కె.ఆర్.గౌతమ్ స్కూల్ నందు విద్యార్థినీ విద్యార్థులకు ఆపద సమయాలలో ఏ విధంగా తమని తాము రక్షించుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ( సెల్ఫ్ డిఫెన్స్) గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాల గురించి, ఈవ్ టీజింగ్ చేయడం వలన కలిగే నష్టాల గురించి, ఎల్.హెచ్.ఎం.ఎస్., సి.సి.కెమెరాల వలన ఉపయోగాలు, సోషల్ మీడియా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి మరియు నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు POCSO యాక్ట్ గురించి, డైయల్ 112 , మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం మొదలగు అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
అదే విధంగా శక్తి టీం బృంధాలు నగరంలోని వివిద ప్రదేశాలలోని మహిళలకు, యువతులతో మాట్లాడి శక్తి యాప్ అనేది అక్రమార్కుల పాలిట ఆయుధంగా మారుతుందని, మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలకు యువతులకు శక్తి యాప్ వలన ఉపయోగాలను తెలియజేసి వారి ఫోన్ లలో శక్తి యాప్ లను డౌన్ లోడ్ చేయించడం జరిగింది.