Home Andhra Pradesh ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయలేని దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం జగన్ ను విమర్శించడమా –...

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయలేని దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం జగన్ ను విమర్శించడమా – మాజీ మంత్రి వెలంపల్లి

5
0

విజయవాడ
04-06-2025

ప్రచురణార్ధం

వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు కూటమి ప్రభుత్వం పై వెన్నుపోటు దినం కార్యక్రమం లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి వెలంపల్లి

భవానీపురం వర్క్ షాపు రోడ్డు నాగయ్య హోటల్ సెంటర్ వద్ద నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు వైసిపి శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు

అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందచేసిన మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇన్ చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు

మాజీ మంత్రి వెలంపల్లి కామెంట్స్

ఇచ్చిన హామీలను అమలు చేయలేనిది కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి వెలంపల్లి

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క పధకం అమలు చేయలేదు – మాజీ మంత్రి వెలంపల్లి

అభివృద్ధి పేరుతో 1 లక్షా 50 వేల కోట్లు అప్పులు చేశారు – మాజీ మంత్రి వెలంపల్లి

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలో కి వచ్చారు – మాజీ మంత్రి వెలంపల్లి

అధికారంలో ఉండి టిడిపి నేతలు ఎమ్మార్వోకి వినతిపత్రం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది – మాజీ మంత్రి వెలంపల్లి

బుద్దా వెంకన్న కు బుద్ధి లేదు కాబట్టే వినతిపత్రం ఇచ్చాడు – మాజీ మంత్రి వెలంపల్లి

వైసిపి నిరసనను అడ్డుకోవాలని అనేక కుయుక్తులు పన్నారు – మాజీ మంత్రి వెలంపల్లి

బుద్దా వెంకన్న సైకిల్ బెల్లు ల దొంగ – మాజీ మంత్రి వెలంపల్లి

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయలేని దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం జగన్ ను విమర్శించడమా – మాజీ మంత్రి వెలంపల్లి

సుపరిపాలన మొదలై ఏడాదయిందని జనసేన సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది – మాజీ మంత్రి వెలంపల్లి

పధకాలు ఆపినందుకు టపాసులు కాల్చడం జనసేన కే చెల్లింది – మాజీ మంత్రి వెలంపల్లి

రాష్ట్ర ప్రజలు కూటమికి పరిపాలన ఎందుకు ఇచ్చారు – మాజీ మంత్రి వెలంపల్లి

ముగ్గులేసుకోవడానికి అధికారం ఇచ్చారా… త్వరలోనే రాష్ట్ర ప్రజలే కూటమి ప్రభుత్వానికి ముగ్గలేపించే రోజులు దగ్గరపడ్టాయి – మాజీ మంత్రి వెలంపల్లి

స్థానిక 40వ డివిజన్ భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ నాగయ్య హోటల్ సెంటర్ వద్ద గల వైయస్ ఆర్ విగ్రహం వద్ద నుంచి మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం నాడు వెన్నుపోటు దినోత్సవం నిరసన ర్యాలీని నిర్వహించారు ముందుగా వైయస్ ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి వేలాది మంది ప్రజలు వైసిపి శ్రేణులతో పాదయాత్ర చేసుకుంటూ విద్యాధరపురంలోని పశ్చిమ ఎమ్మార్వో కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు కూటమి ప్రభుత్వం పై వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు
కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తయిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి పేరుతొ 1 లక్ష 50 వేళ కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఒక్క పధకం కూడా అమలు చేయలేదని పెన్షన్ మాత్రం అమలు చేసారని ఆ పెన్షన్ లో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయని చాలామందికి పెన్షన్లను తొలిగించారని అన్నారు పిల్లలకు అమ్మఒడి ఎగ్గొట్టారని, రైతులకు రైతుభరోస ఎగొట్టారని, ఫీజ్ రీయంబర్స్మెంట్ ఎగ్గొట్టారని, మహిళలకు చేయుత ఎగ్గొట్టారని ఉద్యోగం కల్పన లేదని, ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతి లేదని గతంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి దొంగ మాటలతో దొంగ హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఈ రోజు పరిపాలన చేసే అర్హత లేదని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారన్నారు. ప్రజల భావన మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో జరుగుతుంటే ఇక్కడ బుద్ధిలేని బుద్ధా వెంకన్న పనికి మాలిన వెంకన్న గతంలో రక్తంతో నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని, ఎంపీ టికెట్ కావాలని రాసారని అయిన గాని చంద్రబాబు, లోకేష్ అతని పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. బుద్ధా వెంకన్న ఎదో పేరు తెచ్చుకోవాలని గొప్పలకు పోయి అధికారంలో ఉండి ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చారని, అధికారంలో ఉండి అధికారంలో ఉండి ఎమ్మార్వోకి వినతిపత్రం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని, బుద్దా వెంకన్న కు బుద్ధి లేదు కాబట్టే వినతిపత్రం ఇచ్చాడన్నారు. వైసిపి నిరసనను అడ్డుకోవాలని అనేక కుయుక్తులు పన్నారన్నారు. పోలీస్ వారు సహకరించారని వాళ్లు చెప్పిన ప్రకారం రూట్ మ్యాప్ మార్చుకొని వాళ్ళు చెప్పిన విధంగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగిందన్నారు. ఎండ పెరగాలి వైసిపి నిరసన కార్యక్రమం విజయవంతం అవకూడదని అనేక కుతంత్రాలు చేసిన ప్రజలు, వైసిపి శ్రేణులందరు నడుం బిగించి వేల మంది ఈ రోజు రోడ్ మీదకు వచ్చారని చాల సంతోషంగా ఉందన్నారు. నేడు చేసింది మొట్టమొదటి కార్యక్రమమే అని రానున్న రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరింత తీవ్రంగా వైయస్ఆర్సీపి పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుద్దా వెంకన్న సైకిల్ బెల్లు ల దొంగ అని అన్నారు. సుపరిపాలన మొదలై ఏడాదయిందని జనసేన సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని, పధకాలు ఆపినందుకు టపాసులు కాల్చడం జనసేన కే చెల్లిందన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమికి పరిపాలన ఎందుకు ఇచ్చారు, ముగ్గులేసుకోవడానికి అధికారం ఇచ్చారా… ప్రశ్నించారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలే కూటమి ప్రభుత్వానికి ముగ్గలేపించే రోజులు దగ్గరపడ్డాయన్నారు

ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్, కార్పొరేటర్లు బండి పుణ్యశిల, మండేపూడి చటర్జీ, యరడ్ల ఆంజనేయరెడ్డి, షేక్ రెహమాతున్నీసా, యరడ్ల ఆంజనేయరెడ్డి, ఎండి ఇర్ఫాన్, బాపతి కోటి రెడ్డి, శిరంశెట్టి పూర్ణచంద్రరావు, యలకల చలపతిరావు, పార్టీ డివిజన్ ఇంచార్జ్ లు తంగెళ్ల రామచంద్రరావు, నాయకులు కర్నాటి రాంబాబు, గౌస్ మొహిద్దీన్,షేక్ హయత్, గోదావరి బాబు, దాసి జయప్రకాష్ కెన్నడీ, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు మరియు నాయకులు తోలేటి శ్రీకాంత్, బొందిలి నరేంద్ర సింగ్, బూదాల శ్రీనివాసరావు, కేసరి కృష్ణ రెడ్డి, బాజీ బాబా,నజీర్, దొడ్డా రాజశేఖర్ రెడ్డి,అబ్దుల్ ఘని చిచ్చా,జిల్లా పార్టీ మరియు అనుబంధ విభాగ నాయకులు సయ్యద్ అతీక్,కేసరి సుబ్బా రెడ్డి చిన్నోడు, బండారి వెంకట్, మజ్జి శ్రీనివాసరావు,వీరజల లీల మధు, పొదిలి చంటి, పొలిమెట్ల శరత్, షేక్ మస్తాన్,తనబుద్ది చంద్రశేఖర్ రెడ్డి, విశ్వనాథ రవి, మెట్టు వెంకట రెడ్డి, నియోజకవర్గ స్థాయి పార్టీ మరియు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్లు వాసా ఆదినారాయణ బాబు,ఐతా కిశోర్, బంక చాము, బోండా నిరీష్, మాజి డైరెక్టర్ లు దేరంగుల రమణ, కూరాకుల నాగ, మంజు భార్గవి, పార్టీ నాయకులు డివి రెడ్డి, పెద్ది సత్య సాయి బాబు, శరగడ శంకర్ రెడ్డి, వెన్నం రజని, పిళ్ల సూరిబాబు జగ్గు, తుపాకుల గురుమూర్తి రెడ్డి, గురుమాహంతు మహేష్, బొమ్ము మధు, గ్రంధి రమేష్ కార్యకర్తలు, తదితరులు, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here