ఎన్టీఆర్ వల్లే బడుగు-బలహీనవర్గాలకు రాజకీయ అవకాశం దక్కింది
*ఆస్తిలో సమానహక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్*
*చెల్లెలకు,అక్కలకు సమానహక్కు ఇవ్వాలి.. చట్టానికి మాజీముఖ్యమంత్రి అతీతులు కారు*
*నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు*
గన్నవరం : నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి కార్యక్రమాన్ని గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తొలుత గన్నవరం క్యాంప్ కార్యాలయం లో మెగా బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు.అనంతరం గన్నవరం సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముస్తాబాద్ కార్యక్రమంలో వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగువారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చింది అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేసారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకా మునుపు మదరాసీలుగా గుర్తించే వారిని కానీ ఎన్టీఆర్ సీఎం అయినా తర్వాత ఆంధ్రులుగా గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు.ఎన్టీఆర్ ఆస్తిలో స్త్రీలకు సమానహక్కు, రెండు రూపాయలకు కిలో బియ్యం, ప్రతిపేదవాడికి సొంతింటి కల వంటి పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఆస్తిలో సమానహక్కును అందరూ పాటించాలని అది చట్టమని చట్టానికి మాజీ ముఖ్యమంత్రి తో పాటు ఎవరు అతీతులు కారు అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన మరణంహ లేని మహానాయకుడని కొనియాడారు. అన్న నందమూరి తారకరామారావు టీడీపీ ఏర్పాటు చేయడం వల్ల బడుగు-బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం దక్కిందని గుర్తు చేశారు. గన్నవరం కూడలి లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తానని, పార్టీ నేతలు కూడ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.చరిత్రలో అమరావతి, ఎన్టీఆర్ పేర్లు అజరామరం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు , అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.