ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గురువారంనాడు ‘సీఎస్ఆర్’ లో భాగంగా ప్రొమియా థెరపటిక్స్ సంస్థ వారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కి రక్తదాన శిబిరాలకు మరియు వైద్యసేవల నిమిత్తం అందించింన అంబులెన్స్ ను ప్రారంభించారు.

Spread the love

హైదరాబాద్.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి  గురువారంనాడు ‘సీఎస్ఆర్’ లో భాగంగా ప్రొమియా థెరపటిక్స్ సంస్థ వారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కి రక్తదాన శిబిరాలకు మరియు వైద్యసేవల నిమిత్తం అందించింన అంబులెన్స్ ను ప్రారంభించారు.

ప్రొమియా థెరపటిక్స్ సంస్థకు నారా భువనేశ్వరి  ధన్యవాదాలు తెలుపుతూ.. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్టు ఇన్ని సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తుందంటే దానికి కారణం దాతలే అన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి ఎన్టీఆర్ ట్రస్టుకి తమకి తోచిన విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొమియా థెరప్యూటిక్స్ కంపెనీ డైరెక్టర్ లెక్కల జీవన్, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ CEO రాజేంద్ర కుమార్ ఐపీఎస్ (రిటైర్డ్), COO గోపి , ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *