ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ని సృజన ని కలిసిన మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు మరియు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు

4
0

 ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ని సృజన ని కలిసిన మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు  మరియు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు

మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు  కామెంట్స్

 

స్థానిక 38 వ డివిజన్ లో వరద భాదితుల మీద జరిగిన లాటి ఛార్జ్ గురించి కలెక్టర్ కి వివరించడం జరిగింది 

వరద భాదితులందరి పేర్లను జాబితాలో చేర్చవలిసిందిగా కలెక్టర్ కి విజ్ఞప్తి చేసాం 

ఇటీవల వచ్చిన వరదల వాళ్ళ ఇళ్లలోకి నీరు వచ్చి ఆస్థి నష్టం బాగా జరిగింది, వస్తువులన్నీ పాడవడం జరిగింది

వరద నష్టం పై అధికారులు తప్పుడు నివేదిక ఇస్తున్నారు, కలెక్టర్ ని పరిశీలించవలసిందిగా కోరడం జరిగింది

కలెక్టర్  త్వరితగతిన స్పందించి అధికారులను పంపించి తప్పనిసరిగా పునపరిశీలిస్తానని, వరద భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

వరద భాదితులందరు వచ్చిన అధికారులందరికీ వరదల వళ్ళ   పాడైన వస్తువులను చూపించి కలిగిన నష్టం గురించి అధికారులకు వివరించవలసిందిగా కోరుతున్నాను

రాజకీయాలతీతంగా వరద భాదితులందరిని ఆడుకోవలసిందిగా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి

ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించిన వరద భాదితులకు ఆర్ధిక సహాయం తక్షణం అందజేయవలసిందిగా కోరుతున్నాను

వరద భాదితులకు ఆర్ధిక సహాయం అందించేవరకు వరద బాధితులతో కలిసి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరటం చేస్తుంది

ప్రతి ఇంటికి లక్ష రూపాయలకు పైగా ఆస్థి నష్టం జరిగింది

కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం విరాళాలు వసూలు చేసింది, ముక్కు బడిగా వరద బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది

ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇంచార్జ్ షేక్ ఆసిఫ్  నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి  సెంట్రల్ మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ,  తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here