విజయవాడ నగరపాలక సంస్థ
30-05-2025
ఎక్సల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శుక్రవారం ఉదయం ఎక్సెల్ ప్లాంట్, అజిత్ సింగ్ నగర్ లో అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు వి యం సి ఫైర్ సిబ్బంది.
ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది, అగ్ని ప్రమాదం జరగకుండా ఎక్సల్ ప్లాంట్ చుట్టూ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమేం ఉండాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఎక్సటింగుషేర్ వాడి, మంటలను ఎలా ఆర్పాలి, వంటి విషయాలపై అక్కడున్న సిబ్బంది చే చేయించారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ ఫైర్ ఆఫీసర్ N. వెంకటేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ M.రాజా, సిబ్బంది పాల్గొన్నారు.