ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను ఘ‌నంగా స‌న్మానించిన బెజ‌వాడ బార్ అసోసియేష‌న్ న్యాయ‌వాదులు

Spread the love

ప్ర‌చుర‌ణార్థం 31-10-2025

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను ఘ‌నంగా స‌న్మానించిన బెజ‌వాడ బార్ అసోసియేష‌న్ న్యాయ‌వాదులు

విజ‌య‌వాడ : బెజ‌వాడ బార్ అసోసియేష‌న్ న్యాయ‌వాదులు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను ఘ‌నంగా స‌న్మానించారు. ఇటీవ‌ల బెజ‌వాడ బార్ అసోసియేష‌న్ భ‌వ‌నం ఆధునీక‌ర‌ణ‌కు రూ.30 ల‌క్ష‌లు ఎంపీ నిధుల నుంచి కేటాయించిన సందర్భంగా శుక్ర‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను క‌లిసి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశారు. బార్ అసోయేష‌న్ కు త‌న స‌హాయ స‌హ‌కారాలు అందిస్తాన‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎపీ బార్ కౌన్సిల్ మెంబ‌ర్ చ‌ల‌సాని అజేయ‌ కుమార్, బెజ‌వాడ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ఎస్.కె.భాషా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కె.వి.రంగారావు, న్యాయ‌వాదులు యెర్నేని వేద‌వ్యాస్, స్నేహ జైన్, ఆర్.రామ‌కృష్ణ‌, చెన్నుపాటి ఉషారాణి, వి జయప్రకాష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Loading