25-06-2025
ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ
విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తో ఆంధ్రప్రదేశ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ బుధవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కి విచ్చేసిన గారెత్ విన్ ఓవెన్ ను ఎంపీ కేశినేని శివనాథ్ శాలువతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహుకరించారు. ఈ సందర్భంగా కొండపల్లి బొమ్మల ప్రత్యేకతను గారెత్ విన్ ఓవెన్ కు వివరించారు.
అనంతరం వీరిద్దరూ వర్తమాన సామాజిక రాజకీయ, విద్య,ఉపాధి వంటి అంశాలపై మాట్లాడుకోవటంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల అంశంపై కూడా చర్చించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ రాజకీయ ఆర్థిక అంశాల సలహాదారు నళిని రఘురామన్, అకాడమిక్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈవో అన్నే సుధీర్, డైరెక్టర్ అన్నే లక్ష్మీ తులసీ పాల్గొన్నారు.