ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో వ‌ర‌ల్డ్ క‌ప్ సంబరాలుకె.డి.సి.ఎ మ‌హిళ క్రికెట‌ర్స్ తో క‌లిసి కేక్ క‌ట్ చేసిన ఎంపీ

Spread the love

ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో వ‌ర‌ల్డ్ క‌ప్ సంబరాలు
కె.డి.సి.ఎ మ‌హిళ క్రికెట‌ర్స్ తో క‌లిసి కేక్ క‌ట్ చేసిన ఎంపీ

విజ‌య‌వాడ : టీమిండియా ఐసీసీ వుమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించిన సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో వేడుక‌లు సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. కృష్ణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేష‌న్ కి చెందిన మ‌హిళ క్రికెటర్ల తో క‌లిసి ఎంపీ కేశినేని శివనాథ్ కేక్ క‌ట్ చేసి ప్ర‌జలంద‌రి త‌రుఫున బార‌త మహిళ క్రికెట‌ర్స్ కు అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఆంద్ర క్రికెట్ అసోసియేష‌న్ మ‌హిళ క్రికెట‌ర్స్ ను ప్రోత్స‌హించ‌టానికి ఎప్పుడు ముందు వుంటుంద‌న్నారు. అందుకే వైజాగ్ అంత‌ర్జాతీయ‌క్రికెట్ స్టేడియంలో ఒక గ్యాల‌రీ కి మిథాలీ రాజు పేరు , ఒక గేటుకి రావి క‌ల్ప‌నా పేర్లు పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. కె.డి.సి.ఎ త‌రుఫున డిస్ట్రిక్ అండ్ స్టేట్ లెవ‌ల్ ఆడుతున్న మహిళ క్రికెట‌ర్ల‌కు అండ‌గా వుంటానన్నారు. ప్ర‌పంచ క‌ప్ ను సాధించిన టీమిండియా మ‌హిళ క్రికెట్ ప్లేయ‌ర్స్ ను స్పూర్తి గా తీసుకుని రాణించాల‌ని ఆకాంక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో కృష్ణ డ్రిస్టిక్ కెప్టెన్ సౌమ్య‌, స్టేట్ లెవ‌ల్ క్రికెట్ ప్లేయ‌ర్ ధాత్రి, కోచ్ నాగుర్, బాపిరాజు, కె.డి.సి.ఎ వుమెన్ క్రికెట‌ర్ మెంబ‌ర్ నాగ‌మ‌ణి ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Loading