ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను క‌లిసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

Spread the love

 22-06-2024  

ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ను క‌లిసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ 

విజ‌య‌వాడ : విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), అమలాపురం ఎంపి జి.ఎమ్.హ‌రీష్ బాల‌యోగిల‌ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. జూన్ 24 నుంచి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు తొలిసారి హాజ‌రుకాబోతున్నవీరికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. శ‌నివారం గురునాన‌క్ కాల‌నీలోని ఎంపి కేశినేని శివ‌నాథ్ నివాసంలో వీరిని క‌ల‌వ‌టం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ కి కేశినేని శివ‌నాథ్ పుష్ప‌గుచ్ఛం అందించి, శాలువాతో స‌త్క‌రించారు. అనంత‌రం మంత్రి వాసంశెట్టి ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి హరీష్ బాల‌యోగిని శాలువాతో స‌త్క‌రించ‌టం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ఈ ముగ్గురు నేత‌లు కాసేపు అసెంబ్లీ స‌మావేశాల విశేషాల‌తో పాటు, సంఘ‌టిత‌, అసంఘ‌టిత రంగాల్లో వున్న కార్మికులు, శ్రామికుల అభివృద్ది కోసం చేయాల్సిన ప‌నుల గురించి చ‌ర్చించుకున్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *