ఊర్మిళ నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతంలో పాడైపోయిన రోడ్డు సమస్య కు పరిష్కారం

Spread the love

ఊర్మిళ నగర్  మెయిన్ రోడ్డు ప్రాంతంలో పాడైపోయిన రోడ్డు సమస్య కు పరిష్కారం

*రోడ్డు  పనులు చేయించిన ఎమ్మెల్యే సుజనా

విజయవాడ పశ్చిమ, జూలై 2.

తమ ప్రాంతంలోని 

43 డివిజన్ ఊర్మిళ నగర్ మెయిన్ రోడ్డు  సమస్య తీవ్ర ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని

స్థానికులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని కోరారు. 

ఊర్మిళ నగర్ మెయిన్ రోడ్డు ప్రాంతంలో 

ప్రయాణించాలంటేనే తీవ్ర ఇబ్బంది గా ఉందని 

స్థానికులు ఎమ్మెల్యే కు వివరించడం జరిగింది. 

రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహన చోదకులు  తీవ్ర ఇక్కట్లు పడుతున్నారనీ, పాదచారులు సైతం ఇక్కట్లు కు గురవుతున్నారని  

స్థానికులు సుజనా చౌదరి కు వివరించారు. 

రోడ్డు పనులు వెంటనే చేయాలని ప్రయాణికులకు,

 పాద చారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే ఈ సమస్యను పరిష్కరించారు. తమ రోడ్డు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఊర్మిళ నగర్ ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *