ఉర్ల ఓబనపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం కార్యక్రమం ప్రారంభంలో సభా ప్రాంగణం వద్ద చెట్టును నాటిన భువనేశ్వరి

Spread the love

ఉర్ల ఓబనపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం

కార్యక్రమం ప్రారంభంలో సభా ప్రాంగణం వద్ద చెట్టును నాటిన భువనేశ్వరి

నారా భువనేశ్వరిగారి స్పీచ్ పాయింట్లు

ఉర్లఓబనపల్లి గ్రామానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది..

చంద్రబాబు పై మీకున్న అభిమానం, ప్రేమను 2024 ఎన్నికల్లో మరోసారి చాటుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు ఏపీకి వచ్చి నిలబడి, గ్రామస్థాయి వరకు వెళ్లి మంచి, చెడులను వివరించి ఓట్లపై అవగాహన కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ కుటుంబాల కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించారు..అందుకే ప్రజాప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.

మీ ఓట్లతో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు.

2014 పాలన చూసిన మీరు, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనను కూడా చూశారు. అందుకే 2024లో మీకు ఏ ప్రభుత్వం అవసరమో ఓట్లతో తీర్పునిచ్చారు.

చంద్రబాబును మీరు 8సార్లు ఎమ్మెల్యేగా, 4సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు.

చంద్రబాబు ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చూశారు. నేడు ఆ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పౌరులు అనుభవిస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు లోటు బడ్జెట్లో రాష్ట్ర పగ్గాలు చేపట్టారు..కానీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడపించేందుకు ప్రయత్నించారు.

2019లో అధికారంలోకి రాకపోవడం వల్ల వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.

నేడు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

వైసీపీ ఐదేళ్ల పాలన వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది…రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది.

రాష్ట్ర ప్రజలంతా చాలా ఓపికగా ఉండాలి…చంద్రబాబుకు కొంత సమయం ఇస్తే మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ అందిస్తారు.

ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తారు…

కార్యకర్తల త్యాగాలను మేం ఎప్పుడూ మరచిపోలేము…మీకు టీడీపీ ఎప్పుడూ రుణపడి ఉంటుంది.

గతంలో కార్యకర్తల కోసం లోకేష్ అనేక కార్యక్రమాలు చేశారు…రానున్న కాలంలో మరిన్ని చేసి మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత మా కుటుంబంపై ఉంది.

మా కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు…

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *