ఉమ్మడి కృష్ణాలో అత్యంత దారుణంగా ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్.
నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తిని నేను.
జోగి రమేష్ జగ్గయ్యపేట నుంచి ఇక్కడకు వచ్చాడు.
సంస్కార హీనంగా మాట్లాడుతూ ఉంటాడు.
ఏనుగులు పోయే దారిలో కుక్కలు ఎన్నో మొరుగుతూ ఉంటాయి.
కుక్కకాటుకు చెప్పుదెబ్బలా నేను జోగి విమర్శలపై జగన్ పై పోటీ చేస్తానని ప్రకటించాను.
నాకు మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యం.
మైలవరంలో విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 12.06.2025.
“మాజీమంత్రి జోగి రమేష్ చరిత్ర గురించి మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. గత ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్. ఎన్డీఏ కూటమి ప్రజల ఆశీస్సులతో మైలవరం నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తిని నేను. జోగి రమేష్ అసందర్భంగా విమర్శలు చేస్తూ ఉంటాడు. ఏనుగులు పోయే దారిలో కుక్కలు ఎన్నో మొరుగుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.” అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మైలవరం పట్టణంలో శాసనసభ్యుని కార్యాలయం నుంచి అన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు కూటమి కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, క్షీరాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని గజమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఏ సందర్భం లేకుండా వచ్చి జోగి రమేష్ సవాళ్లు విసురుతున్నాడని పేర్కొన్నారు. మీడియా వారు నిన్న ఓ సమావేశంలో ‘ఇక్కడ రాజీనామా చేస్తే మీరు, రమేష్ తేల్చుకుంటారా..’ అని తనను ప్రశ్నించగా కుక్క కుక్కకాటుకు చెప్పు దెబ్బలాగా తను సమాధానం చెప్పినట్లు వెల్లడించారు.
నేను జోగి రమేష్ పైనే ఎందుకు పోటీ చేయాలి..? ఈ ఉమ్మడి జిల్లాలోనే అత్యంత దారుణమైన ఓటమి చవిచూసిన జోగి రమేష్ పై ఎందుకు పోటీ చేయాలి.? వాళ్ల నాయకుడు జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయమనండి. పులివెందులలో నేను పోటీ చేస్తా అని మీడియా సమక్షంలో చెప్పానన్నారు.
జోగి రమేష్ లాగా వెకిలితనంగా, అసభ్యంగా మాట్లాడటం తమ నైజం కాదన్నారు. అతని మాటకు సమాధానంగా తను స్పందించినట్లు స్పష్టం చేశారు. ఒక రాష్ట్ర స్థాయి నేత, మాజీ ముఖ్యమంత్రిని కించపరచాలనే ఉద్దేశం తనది కాదన్నారు. ప్రతి మాట మాట్లాడేటప్పుడు మంచి, చెడు తెలుసుకుని మాట్లాడాలన్నారు. సంస్కారవంతంగా మాట్లాడాలని ప్రతిపక్షానికి హితవు పలికారు. జోగి రమేష్ కూడా జగ్గయ్యపేట నుంచి ఇక్కడకు వచ్చాడన్నారు. నాకు మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజాభీష్ట పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తల్లుల ఖాతాల్లో నేడు రూ.8,745 కోట్లు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
దీపం-2 పథకం ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛను కింద లబ్దిదారులకు ఏటా రూ.34,000 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదే నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు వెల్లడించారు. పి-4 కార్యక్రమంతో పేదరికం నుండి విముక్తి లభిస్తుందన్నారు.
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి పూర్తి చేశామన్నారు. బుడమేరు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం సహాయనిధి కింద నియోజకవర్గంలో 628 మందికి రూ.4.94 కోట్లు మంజూరు చేయించినట్లు వెల్లడించారు.
ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతో దార్శనికులు, మేధావి, విజనరీ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనా దక్షత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్ధతతో విభజింప పడిన రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు కూడా క్రమేపీ మెరుగుపడుతున్నాయన్నారు.
ఏడాది కాలంలో సంపదను సృష్టించి పథకాలు అమలు చేసి వృద్ధి రేటును పెంచి పేదరికం లేని సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం ప్రజల ఆశీర్వాదం అవసరం అన్నారు. మరిన్ని పథకాలు, ప్రణాళికలతో నిరంతరం శ్రమించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మైలవరం ఏఎంసీ చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ , మైలవరం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ అక్కల రామ్మోహనరావు (గాంధీ) బీజేపీ నాయకులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.