05-06-2025 ఉమ్మడి కృష్ణాజిల్లాలకు నెట్టెం రఘురామ్, కొనకళ్ల నారాయణ సూర్యచంద్రులాంటి నాయకులు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కె.డి.సి.సి.బి ఛైర్మన్ నెట్టెం ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాద్ దవుల కోసం కాకుండా టిడిపి అభివృద్దికై కృషి నాయకుడు నెట్టెం క్రమశిక్షణ గల నాయకులు నెట్టెం, కొనకళ్ల, నాగుల్ మీరా టిడిపి శ్రేణులకు ఆదర్శం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట జవదాటని నాయకులు నెట్టెం, కొనకళ్ల నెట్టెం నాయకత్వంలో కె.డి.సి.సి.బి ను మరింత వృద్ధిలోకి వస్తుందని ఆకాంక్ష విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షుడు నెట్టెం రఘురామ్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లు కైవసం చేసుకుందంటే నెట్టెం, కొనకళ్ల సారధులుగా వుండటం వల్లే సాధ్యపడింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలకు నెట్టెం రఘురామ్, కొనకళ్ల నారాయణ సూర్యచంద్రులాంటి నాయకులని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కృష్ణాజిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా మాజీమంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, కొలికపూడి శ్రీనివాసరావుల తో కలిసి పాల్గొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ సభాధ్యక్షత వహించిన ఈ సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నెట్టెం రఘురామ్ కి కె.డి.సి.సి బ్యాంక్ చైర్మన్ పదవి అలంకారం మాత్రమే.ఆయన గతంలోనే ఉన్నత పదవులు అలకరించారు. తన అనుభవంతో కె.డి.సి.సి బ్యాంక్ మరింత వృద్ధిలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. తన రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న నెట్టం రఘురామ్ బ్యాంక్ చైర్మన్ గా ప్రజలందరికీ జీవనోపాధి కల్పించే విధంగా కృషి చేస్తారని తెలిపారు. పార్టీలో కానీ, నాయకుల మధ్య ఏ సమస్య వచ్చినా నవ్వుతు వాటిని షరిష్కరించగల సామర్థ్యం వున్న నాయకుడు నెట్టెం అంటూ కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తనకి నెట్టెం రఘురామ్ బాటలో నడవాలని సూచించారు. ఆనాటి నుంచి నేటి వరకు నెట్టెం బాటలో నడుస్తున్నాని, ఏ విషయమైన నెట్టెం తో చెప్పే చేస్తానన్నారు. పదువుల కోసం కాకుండా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి విజయం అందించిన నాయకుల్లో నెట్టెం రఘురామ్, కొనకళ్ల నారాయణ, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా ముందు వరుసలో వుంటారని…వీరిని టిడిపి శ్రేణులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పదవులు లభిస్తాయన్నారు. పదవులు రాలేదని నిరాశ పడొద్దని హితవు పలికారు. ఈకార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు, టిడిపి అనుబంధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.