ఇంద్రకీలాద్రి, 14 అక్టోబర్ 2025ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, దేవదాయశాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీ డాక్టర్ హరిజవహర్ లాల్, దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ వార్ల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం దేవస్థానం ఈవో శీనా నాయక్, అర్చకులు, వేద పండితులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ని కలిసి శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల విజయవంతం గురించి వివరించారు.ఈ సందర్బంగా మంత్రి వర్యులు, కార్యదర్శి, కమిషనర్, ఈవో వార్లు పవన్ కళ్యాణ్ వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య, వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.
![]()
